Asianet News TeluguAsianet News Telugu

Kitchen tips: ఎండాలకాలం ఫుడ్ త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే..!

వేసవిలో ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాలం చెల్లిన ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వండిన తర్వాత, సరైన సమయానికి తినడం, మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం.

Easy Tips To prevent Food From Spoiling In summer
Author
Hyderabad, First Published Mar 31, 2022, 3:14 PM IST

ఎండాకాలం ఎండలు మండటం మొదలయ్యాయి. ఎండాకాలం మొదలైందంటే చాలు.. మనకు చెమటలు కారిపోతూ ఉంటాయి. అంతేకాదు.. వేసవిలో మన  ఆరోగ్యంలో  చాలా మార్పులు చేసుకుంటూ ఉంటాయి. అయితే. ఆరోగ్యం మాత్రమే కాదు... ఆహారం కూడా పాడౌతుంది.

 పాల నుండి పండ్ల వరకు అన్ని ఆహారాలు త్వరగా చెడిపోతాయి. ఇది తెలియకుండానే, మనకు అనారోగ్యం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. వేసవిలో ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాలం చెల్లిన ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వండిన తర్వాత, సరైన సమయానికి తినడం, మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం.

వేసవిలో  ఆహారం ఎక్కువగా  వండకూడదు. ఎక్కువ కాలం ఆహారం మిగిలి ఉంటే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఆహారాన్ని త్వరగా నాశనం చేస్తుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. 

వేసవిలో ఆహారాన్ని వృధా చేయవద్దు:

వేసవి ఆకలిని తగ్గిస్తుంది.  ప్రజలు దాహం తీర్చుకోవడానికి ఎక్కువ నీరు తాగుతారు.  ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.  కాబట్టి ఆ సమయానికి సరిపడా ఆహారాన్ని మాత్రమే తయారు చేయండి. ఇద్దరు లేదా ముగ్గురుకి సరిపడా ఆహారాన్ని తయారు చేయవద్దు. అలాగే, వడ్డించే రెండు గంటల ముందు ఆహారాన్ని సిద్ధం చేయండి.

మిగిలిన ఆహారం ఎలా ఉండాలి? : ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెంచండి. ఆహారాన్ని రిఫ్రిజిరేటర్ వెలుపల ఎక్కువసేపు ఉంచినట్లయితే, బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ఆహారాన్ని త్వరగా పాడుచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచండి.

 ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండదు. కొంతమంది ఫ్రిజ్‌ని ఉపయోగించరు. బయట ఉష్ణోగ్రతల వద్ద తింటే పాడైపోతాయి. కాబట్టి ఫ్రిజ్ లేనివారు.. ఒక గిన్నెలో చల్లటి నీటిని ఉంచండి. తర్వాత ఆహారాన్ని ఏదైనా కంటైనర్ లో ఉంచి.. దానిని నీటి గిన్నెలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. ఆహారం త్వరగా పాడవ్వకుండా ఉంటుంది. 

భోజనం చేసిన తర్వాత  మిగిలిన ఆహారాన్ని కంటైనర్‌లో ఉంచండి. తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. మీరు ఆహారాన్ని తయారు చేసి వెంటనే తినేటప్పుడు ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచవద్దు. ఆహారాన్ని సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్ లో ఉంచాలి.

ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ఏ కారణం చేత చేసిన వంటను మళ్లీ వేడి చేయకండి. పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు వేగంగా తగ్గడం ప్రారంభిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios