విటమిన్ డి లోపం ఉందా? ఇవి తింటే చాలు..!

మన శరీరంలో డి విటమిన్ తగ్గిందని ఎలా తెలుసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకుంటే.. మన శరీరంలో విటమిన్ డి పెపరుగుతుందో తెలుసుకుందాం..
 

Do you have vitamin D deficiency? Just eat these foods ram

మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపిస్తే… ఎముకలు బలహీనంగా మారిపోతాయి. మన ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. మన మొత్తం ఆఱోగ్యానికి కూడా సహాయపడుతుంది. కానీ.. ఈ మధ్యకాలంలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా.. కనీసం ఎండ అనేది కూడా తగలకపోవడం వల్ల.. చాలా మందిలో ఈ విటమిన్ లోపం వస్తుంది. అసలు.. మన శరీరంలో డి విటమిన్ తగ్గిందని ఎలా తెలుసుకోవాలి..? ఎలాంటి ఆహారం తీసుకుంటే.. మన శరీరంలో విటమిన్ డి పెపరుగుతుందో తెలుసుకుందాం..


విటమిన్ డి లోపం ఉంటే కనపడే లక్షణాలు…

విటమిన్ డి మన శరీరంలో కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. బలమైన ఎముకలు, కండరాలకు ఇది చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు నొప్పులు రావడంతో పాటు.. కండరాలు బలహీనంగా మారతాయి.


శారీరక అలసట:

మీరు నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తే, అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. విటమిన్ డి మీ శరీరం శక్తి స్థాయిలలో పాత్రను పోషిస్తుంది. అందుకే ఈ విటమిన్ లోపించినప్పుడు ఆహారం తీసుకున్నా కూడా నీరసంగానే ఉంటుంది.


మూడ్ స్వింగ్స్:

మానసిక ఆరోగ్యానికి విటమిన్ డి కూడా ముఖ్యం. ఈ పోషకాల లోపం నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలతో ముడిపడి ఉంది. ఊరికూరికే మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి.

జుట్టు రాలడం:

విటమిన్ డి లోపం జుట్టు రాలడానికి దోహదపడుతుంది, ఎందుకంటే ఈ పోషకం హెయిర్ ఫోలికల్స్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


విటమిన్ డి లోపిస్తే..  ఏ ఫుడ్స్ తినాలి?

చేపలు..

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ విటమిన్ డి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

గుడ్డు:

గుడ్డు సొనలు విటమిన్ డి కి మరొక మంచి మూలం. మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వలన మీ విటమిన్ డి తీసుకోవడం పెరుగుతుంది.

ఇతర ఆహారాలు:

పాలు, ఆరెంజ్ జ్యూస్, మిల్లెట్స్ వంటి అనేక ఆహారాలు విటమిన్ డితో సమృద్ధిగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. విటమిన్ డి మనకు లభిస్తుంది.

సూర్యకాంతి:

ఇది విటమిన్ డి కి గొప్ప మూలం. సూర్యరశ్మి విటమిన్ డి శరీరానికి ప్రధాన మూలం. తెల్లవారుజామున ఎండలో సమయం గడపడం,  చర్మాన్ని సూర్యరశ్మికి బహిర్గతం చేయడం వలన మీ శరీరం విటమిన్ డి ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

ఇవన్నీ కనుక రెగ్యులర్ గా డైట్ లో తీసుకుంటూ... ఎండలో ప్రతిరోజూ కొంత సమయం గడిపితే.. విటమిన్ డి లోపం అనేది ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు. 

గమనిక:  విటమిన్ డి లోపం ఉందో లేదో సొంత నిర్థారణ చేసుకోవడానికి బదులు.. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios