డబ్బులు తేలికగా సంపాదించాలనే దురుద్దేశంతో చాలామంది వ్యాపారులు పాలను కల్తీ చేస్తుంటారు. దీంతో మనకు ఆర్థికభారమే కాదు.. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి మనం కొనే పాలలో కల్తీ జరిగిందని ఎలా తెలుసుకోవచ్చు?
స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి: ఒకవైపు హోలీ (HOLI 2025) సందడి, మరోవైపు ఈద్ (EID 2025) కోసం ప్రిపరేషన్స్. పండుగల సీజన్ కావడంతో ఇళ్ల నుంచి మార్కెట్ల వరకు సందడిగా ఉంది. హోలీ, ఈద్ రెండు పండుగలు స్నేహానికి, సోదరభావానికి చిహ్నంగా భావిస్తారు. ప్రజలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని సమాజంలో ప్రేమను పంచుతారు. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో కల్తీ చేసేవాళ్లకు మాత్రం పండగే. పండుగ అవసరాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ చేసేవాళ్లు తినే పదార్థాల్లో కల్తీ చేసి మీ ఆరోగ్యంతో ఆడుకుంటారు. ముఖ్యంగా పాలు, పనీర్, మావాలో కల్తీ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ కల్తీని ఎలా గుర్తించాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే ప్రశ్న. ఈ రోజు మనం కొన్ని సులభమైన చిట్కాలు తెలుసుకుందాం. దీని ద్వారా మీరు తినే పదార్థాల్లో కల్తీని సులభంగా గుర్తించవచ్చు. ఈ సులభమైన ఇంటి చిట్కాలతో మీరు అసలు, నకిలీ తేడాను తెలుసుకోవచ్చు. కల్తీ పదార్థాల వల్ల మీ ఆరోగ్యానికి కలిగే నష్టాల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
పాలు ఎంత స్వచ్ఛమైనవి? (How pure is the milk?)
మీకు పాలు సింథటిక్ అని అనుమానం ఉంటే అంటే డిటర్జెంట్, సబ్బు కలిపారని అనుమానం ఉంటే.. ఒక శుభ్రమైన సీసాలో పాలు పోసి గట్టిగా ఊపండి. పాలల్లో ఎక్కువ నురుగు వస్తే, అది చాలాసేపు అలాగే ఉంటే.. ఆ పాలలో డిటర్జెంట్ లేదా సబ్బు కలిసినట్లు అనుమానించాలి.
పాలలో నీళ్లు కలిపారని తెలుసుకోవాలంటే పాలు కొన్ని చుక్కలు నున్నటి ప్రదేశంలో వేయండి. ఆ చుక్కలు వెంటనే కారిపోతే అందులో నీళ్లు కలిపినట్లు అర్థం. స్వచ్ఛమైన పాల చుక్కలు చిక్కగా ఉండి వెంటనే కారవు.
పాలలో స్టార్చ్ కలిపారో లేదో తెలుసుకోవాలంటే రెండు మూడు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పాలలో వేయండి. పాలు నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ కలిపినట్లు గుర్తించాలి.
పనీర్ ఎంత స్వచ్ఛమైనది? (How pure is the cheese?)
పాలలో మాదిరిగానే పనీర్‌లో కూడా సింథటిక్ లేదా స్టార్చ్ కల్తీ చేసే అవకాశం ఉంది. దీన్ని గుర్తించడం కూడా సులభమే. పనీర్‌ను వేడి నీటిలో వేయండి. పనీర్ విరిగిపోతుంటే, కొద్దిగా వాసన వస్తుంటే అది సింథటిక్ పాలతో తయారు చేసినట్లు గుర్తించాలి.
పనీర్ చిన్న ముక్కలో రెండు మూడు చుక్కల అయోడిన్ టింక్చర్ వేయండి. పనీర్ రంగు నీలంగా మారితే అందులో స్టార్చ్ కలిపినట్లు గుర్తించాలి.
మావా ఎంత కల్తీ అయింది? (How much adulterated is Mawa?)
మావా అంటే కోవాలో కూడా సింథటిక్ పాలు, స్టార్చ్ లేదా డిటర్జెంట్ కలిపే అవకాశం ఉంది. దీని స్వచ్ఛతను పరీక్షించడానికి కూడా సులభమైన మార్గాలు ఉన్నాయి.
మావాను అరచేతిలో రుద్దితే జిడ్డుగా అనిపిస్తే, సబ్బులా అనిపిస్తే అందులో సింథటిక్ కల్తీ ఉన్నట్లు అనుమానించాలి.
మావాలో అయోడిన్ టింక్చర్ వేసినప్పుడు రంగు నీలంగా మారితే అందులో స్టార్చ్ కలిపినట్లు గుర్తించాలి.
మావాను నీటిలో వేసి కరిగించినప్పుడు నురుగు వస్తే అందులో డిటర్జెంట్ కలిపినట్లు గుర్తించాలి.
కల్తీ స్వీట్లను గుర్తించండి! (How Identify adulterated sweets!)
ఎక్కువగా స్వీట్లలో కల్తీ చేసే ప్రమాదం ఉంది. వెండి పూత పూసిన స్వీట్లు లేదా సింథటిక్ రంగులు, కెమికల్స్ కలిపిన స్వీట్లు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. వీటిని కూడా సులభంగా గుర్తించవచ్చు.
స్వీట్‌పై ఉన్న వెండి రేకును వేళ్లతో రుద్దితే అది కరిగిపోతే లేదా వేలికి అంటుకుంటే అది నకిలీదని గుర్తించాలి.
స్వీట్ ముక్కను తెల్లటి వస్త్రంపై రుద్దితే మరక పడితే అందులో కల్తీ రంగులు కలిపినట్లు గుర్తించాలి.
అలాగే ఎక్కువ మెరుపు, ఘాటైన వాసన వచ్చే స్వీట్లలో కెమికల్స్ కలిపే అవకాశం ఉంది.