ప్రతిరోజూ కప్పు కాఫీ.... మన ఆయుష్షును పెంచుతుందా..?

ఇదే కాఫీ.. మనకు ఆయుష్షు పెంచుతుందట. మన మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం...

Can Coffee Consumption lower risk of death? here is what a study Found

కాఫీ ప్రియులకు ఒక రకంగా ఇది శుభవార్తే. చాలా మంది ఉదయాన్నే గుమగుమలాడే.. వేడి వేడి కాఫీ తాగేందుకు ఇష్టం చూపిస్తారు. అయితే... ఈ కాఫీలో కెఫిన్ ఉంటుంది.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చాలా మంది చెప్పే ఉంటారు. అయితే.. ఇదే కాఫీ.. మనకు ఆయుష్షు పెంచుతుందట. మన మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం...

బ్రిటిష్ కాఫీ అసోసియేషన్ ప్రకారం, UKలో ప్రతిరోజూ 98 మిలియన్ కప్పుల కాఫీని వినియోగిస్తున్నారు. కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత చెడ్డది కాదని పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలింది. మానసికంగానూ, శారీరకంగానూ కాఫీ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

కాగా... తాజా పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే...ప్రతిరోజూ కాఫీని మితంగా తాగేవారు.. అసలు కాఫీ తాగనివారి కంటే.. ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటున్నారట. కాఫీ తాగని వారే త్వరగా మరణిస్తున్నట్లు తేలింది.

2006 నుండి 5,00,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి జన్యుశాస్త్రం, జీవనశైలి, ఆరోగ్యం, వారు కాఫీ తాగే అలవాటు సహా.. అన్ని వివరాలు సేకరించి చేసిన పరిశోధనలో ఈ విషయం తెలియడం గమనార్హం.

నివేదిక ప్రకారం, అధ్యయన బృందం వ్యక్తుల మరణ ధృవీకరణ పత్రాల నుండి సేకరించిన సమాచారాన్ని 2009 నుండి ఏడు సంవత్సరాల పాటు పాల్గొనేవారిని ట్రాక్ చేయడానికి ఉపయోగించింది, ఈ సమయంలో 3,177 మంది మరణించారు. వయస్సు, లింగం, జాతి, విద్యా స్థాయి, ధూమపాన స్థితి, శారీరక శ్రమ పరిమాణం, బాడీ మాస్ ఇండెక్స్, ఆహారం వంటి అంశాలను పరిగణించారు. అయితే పంచదార ఎక్కువగా వేసుకొని కాఫీ తాగేవారిలో మళ్లీ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వారు చెప్పడం గమనార్హం.


రోజుకు 2.5 ,  4.5 కప్పుల మధ్య బ్రూ తాగేవారికి 29 శాతం తక్కువ మరణ ప్రమాదం కనిపించింది. కాఫీ మంచిది అన్నారు కదా అని.. షుగర్ స్పూన్లకు స్పూన్లు వేసుకొని మాత్రం తాగవద్దు. షుగర్ చాలా మితంగా కలుపుకొని కాఫీ తాగేవారిలో మాత్రమే...  మరణ రేటు తక్కువగా ఉందని పరిశోధనలో తేలడం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios