Asianet News TeluguAsianet News Telugu

ఏం తింటే నెల రోజుల్లో బరువు తగ్గుతారో తెలుసా?

 మనం ఎంత కష్టపడినా.. బరువు మాత్రం తగ్గలేకపోతున్నాం అని ఫీలయ్యేవారు కూడా చాలా మంది ఉంటారు. మీరు కూడా  అదే కోవలో ఉంటే.. ఈ ఫుడ్ ని కనుక మీరు రోజూ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గుతారు. మరి.. ఏం తినాలో ఓసారి చూద్దాం...

Breakfast Diet Plan For Weight loss ram
Author
First Published Aug 24, 2024, 2:50 PM IST | Last Updated Aug 24, 2024, 2:50 PM IST

ప్రతి ఒక్కరూ  హెల్దీగా, ఫిట్ గా ఉండాలి  అనే కోరుకుంటారు. కానీ.. మనం సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం వల్ల  తెలీకుండానే బరువు పెరిగిపోతూ ఉంటాం. అంతేకాదు.. చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒబేసిటీ సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే... అధిక బరువును తగ్గించుకోవాలి. 

అయితే.. మనం ఎంత కష్టపడినా.. బరువు మాత్రం తగ్గలేకపోతున్నాం అని ఫీలయ్యేవారు కూడా చాలా మంది ఉంటారు. మీరు కూడా  అదే కోవలో ఉంటే.. ఈ ఫుడ్ ని కనుక మీరు రోజూ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గుతారు. మరి.. ఏం తినాలో ఓసారి చూద్దాం...

బరువు ఈజీగా తగ్గడానికి మీరు రోజూ ఉదయాన్నే పరగడుపున  మెంతుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.  మెంతుల నీరు తాగడం వల్ల  డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. మెటబాలిజం కూడా మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలి అనుకునేవారు..  ఉదయాన్నే 7గంటలలోపు నానపెట్టిన బాదం పప్పు,  వాల్ నట్స్ తీసుకోవాలి. వీటిలో విటమిన్స్, , హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది.

ఇక.. ఉదయం 9 లోపు బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అయితే.. ఎక్కువగా తినకూడదు. కేవలం రెండు ఇడ్లీలు, సాంబార్ తో తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తినడం వల్ల ఈజీగా  బరువు తగ్గుతారు.

లేదు అంటే.. మీరు బ్రేక్ ఫాస్ట్ లో  ఫ్యాట్ తక్కువగా ఉండే పెరుగు, దాల్ పరాటా తినొచ్చు. అది కూడా కాదు అంటే...కూరగాయలు అన్నీ కలిపి చేసిన శెనగపిండి చీలా, రాగి వెజిటేబుల్ చీలా లాంటివి కూడా తినొచ్చు. ఒక కోడిగుడ్డు తినాలి. బ్రేక్ ఫాస్ట్ చేసిన 30 నిమిషాల తర్వాత.. చిన్న గ్లాసు పాలు తాగొచ్చు.

9లోగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి అయిపోతుంది కాబట్టి.... 11:30 కి చిన్న గిన్నెడు పండ్లు తినాలి. అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. లేదంటే మొలకలు అయినా తినొచ్చు. వీటిలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి.

సాయంత్రం గ్రీన్ తాగాలి. ఇది కూడా బరువు తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఈ గ్రీన్ టీలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేస్తే సరిపోతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ తాగడం ఇష్టం లేకపోతే.. లెమన్ వాటర్ తాగొచ్చు. ఇందులో బ్లాక్ సాల్ట్ కలుపుకోవాలి. పంచదార మాత్రం వాడకండి.

ఈ డైట్ ని సరిగ్గా నెల రోజులు పాటిస్తే... కచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios