Boeing 737: ఒక యువకుడు తన దగ్గరున్న డబ్బులతో పాత బోయింగ్ విమానం కొన్నాడు. తరువాత దాన్ని గొయ్యి తీసి తన పెరట్లో పాతి పెట్టాడు. పూర్తిగా పాతేయ లేదు. అందులోనికి రాకపోకలు సాగించేలా పాతిపెట్టాడు. అలా ఎందుకు చేశాడో తెలిస్తే మీరు షాకవుతారు.
పాత విమానాలను ఎగ్జిబిషన్ కోసం పెడతారు ఎంతో మంది. లేదా దాన్ని రెస్టారెంట్ కింద మార్చి బిజినెస్ చేయడం కూడ జరుగుతుంది. కానీ ఒక యువకుడు పాత బోయింగ్ విమానం కొని.. దాన్ని సరికొత్తగా వాడుతున్నాడు. యూకేలోని డెర్బీషైర్‌కు చెందిన 45 ఏళ్ల డేవ్ బిల్లింగ్స్ అనే ఇంజనీర్ తన ఇంటి పెరట్లో బోయింగ్ 737 విమానాన్ని పాతేశాడు.
స్క్రాప్ యార్డ్‌లో వదిలేయాల్సిన బోయింగ్ 737-500 విమానం ముందు భాగాన్ని సుమారు 4,000 పౌండ్లకు (సుమారు 5 లక్షల రూపాయలు) కొన్నాడు. ఆ తర్వాత 3 టన్నుల బరువున్న ఈ విమాన భాగాన్ని తన తోటలో 14 అడుగుల లోతులో పాతేశాడు.
మొదట విమానం కొనడాన్ని అతని భార్య వ్యతిరేకించింది. అయితే ఇతని కొడుకుకు విమానాలంటే చాలా ఇష్టం. దీంతో భార్య మాట కూడ వినకుండా స్నేహితుల సపోర్టుతో కొన్నాడు. దాన్ని భూమిలో పాతేశాడు. అందులోనికి రాకపోకలు సాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. విద్యుత్, తాగునీటి సదుపాయాలతో పాటు సోలార్ ప్యానెళ్లు, సొంత బోరుబావిని ఏర్పాటు చేశాడు. విమానంలోని టాయిలెట్‌ను ఇంటి సెప్టిక్ ట్యాంక్‌కు అనుసంధానించాడు. ప్రత్యేక వెంటిలేషన్ సిస్టమ్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
దీన్ని ఒక 'డూమ్స్‌డే బంకర్' (భూకంపం, సునామీ, పెద్ద మహమ్మారి లాంటి కష్టాలు వస్తే సురక్షితంగా ఉండే ప్రదేశం) అని మీడియా వాళ్ళు చెబుతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన స్నేహితులతో పార్టీలు చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇలా ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్నాడు.
తగినంత ఆహారం దాచుకుంటే, మూడవ ప్రపంచ యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా నెలల తరబడి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన కుటుంబంతో ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చని డేవ్ చెబుతున్నాడు.














