సినిమా ఇండస్ట్రీకు చెందిన చాలా మంది తారలు రాజకీయాల్లోకి వచ్చి పదవులు అధిరోహించిన సందర్భాలు ఉన్నాయి. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సినిమా వాళ్లు కూడా ఈ ఎన్నికలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాలిటిక్స్ పై స్పందించే హీరో నిఖిల్ కు వైకాపాతో బంధాలు ఉన్నాయి.

నిఖిల్ మావయ్య వైకాపాలో చేరారు. ప్రకాశం జిల్లాలో ఓ నియోజక వర్గం నుండి ఆయన పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయనకు మద్దతుగా నిఖిల్ కూడా ప్రచారం చేయబోతున్నారని తద్వారా రాజకీయాల్లో కూడా బిజీ అవుతాడనే మాటలు విపిస్తున్నాయి. దర్శకుడు వి.వి.వినాయక్ కూడా వైకాపాలో చేరే అవకాశం ఉందని అన్నారు. కానీ వినాయక్ ఆ మాటలను తోసిపుచ్చారు. తనకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం ఉందని ఇంకా ఏ విషయం నిర్ణయించుకోలేదని అన్నారు.

సీనియర్ హీరో మోహన్ బాబు వైకాపా పార్టీ తరఫున రంగంలోకి దిగుతారని అంటున్నారు. నిర్మాత పివిపికి కూడా రాజాకీయలపై అమితాసక్తి ఉంది. గతంలో కూడా టికెట్   కోసం ప్రయత్నించారు. ఈసారి ఆయన వైకాపా తరఫున పోటీ చేయడం ఖాయమంటున్నారు.