Asianet News TeluguAsianet News Telugu

"యమన్" మూవీ రివ్యూ

  • చిత్రం: యమన్
  • నటీనటులు: విజయ్ ఆంటోని, మియా జార్జ్, త్యాగరాజన్ తదితరులు
  • నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, లైకా ప్రొడక్షన్స్
  • కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీవా శంకర్
  • ఏసియానెట్ రేటింగ్ - 3.25/5
YAMAN MOVIE REVIEW

కథ...

అశోక చక్రవర్తి ( విజయ్ ఆంటోని) ఓ మామూలు వ్యక్తి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అప్పటి నుంచీ తన తాత దగ్గరే పెరుగుతాడు. అల్లారు ముద్దుగా తల్లీ దండ్రీ లేని లోటు లేకుండా పెంచిన తన తాతకు జబ్బు చేస్తుంది. తాతను ఆసుపత్రికి తీసుకెళ్తే క్యాన్సర్ వ్యాధి అని చెప్పిన డాక్టర్ చికిత్స కోసం మూడు లక్షల రూపాయాలు అవసరం అవుతుందని చెప్తాడు. అయితే డబ్బు కోసం ఎవర్ని అడిగినా సాయం దొరక్కపోవడంతో దిగాలు పడుతున్న అశోక్ కు ఓ అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచచుకుని తాత చికిత్సకు డబ్బు కోసం ఓ యాక్సిడెంట్ కేసును తన మీద వేసుకొని జైలుకెళ్తాడు.

ఆ యాక్సిడెంట్ చేశాడని జైల్లో ఉన్న అశోక్ చక్రవర్తిని చంపేందుకు వస్తాడు బాధితుడు. అయితే అతని మెడలు విరిచి తగిన బుద్ధి చెప్చాడు అశోక్. అతని ప్రత్యర్థి అయిన మరో వ్యక్తి జైల్లో అశోక్ తో స్నేహం చేసి అతన్ని బయటికి రప్పిస్తాడు. ఆ తర్వాత అతని జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన  గొడవల్లో అశోక్ ఇరుక్కుపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓ గ్రూపులో చేరుతాడు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ ( త్యాగరాజన్)కు చేరువ అవుతాడు. అలా ఫ్యాక్షన్ గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పాండుకు ప్రధాన ప్రత్యర్థిగా మారతాడు.

తాను గతంలో హత్య చేసిన దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోని) కుమారుడే అశోక్ చక్రవర్తి అని మంత్రి పాండుకి తెలుస్తుంది. దాంతో ఓ దశలో మంత్రి పాండు, మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ తో చేతులు కలిపి అశోక్ ను హత్య చేయాలని కుట్ర పన్నుతాడు. ఆ కుట్రలను ఎదిరించి ఎన్నికల్లో ఎలా గెలుపొందాడు? దేవరకొండ గాంధీని పాండు ఎందుకు చంపాడు? గాంధీ కుట్రలకు అశోక్ చక్రవర్తి కుటుంబం ఎలా అన్యాయానికి గురైంది? రాజకీయ ప్రత్యర్థులపై అశోక్ ఎలా పగ తీర్చుకున్నాడు. చివరకు ఆయన మంత్రిగా ఎలా మారాడన్నది ఈ సినిమా కథ.

YAMAN MOVIE REVIEW

నటీనటులు...

దేవరకొండ గాంధీగా, అశోక్ చక్రవర్తిగా విజయ్ ఆంటోని రెండు విభిన్న పాత్రలను తనదైన శైలిలో పోషించాడు. మూస పాత్రలకు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో విజయ్ ఆంటోని స్టైల్ బాగుంది. మామూలు యువకుడిగా, వ్యాపారిగా, రాజకీయ నేతగా పలు షేడ్లు ఉన్న పాత్రను ఆయన పోషించి ఆకట్టుకున్నారు. తొలి చిత్రంతో పోల్చుకుంటే యమన్‌గా విజయ్ ఆంటోని రాటుదేలాడు. యమన్ చిత్రంలో ఆంటోని చక్కని నటన ప్రతిభ కనబరిచాడు. ఫైట్స్, డ్యాన్స్‌ ల్లోనూ ఆకట్టుకొన్నాడు. సీనియర్ నటుడు త్యాగరాజన్ చాలా రోజుల తర్వాత విలన్ ఛాయలు ఉన్న మాజీ ఎమ్మెల్యే కరుణాకరన్ పాత్రలో కనిపించారు. ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఇక హీరోయిన్ మియా జార్జ్ కూడా వెండితెర నటిగా, అశోక్ చక్రవర్తి భార్యగా సింప్లీ సూపర్బ్ అనిపించింది.

సాంకేతిక నిపుణులు...

ముందుగా చెప్పుకోవల్సింది దర్శకుడు జీవా శంకర్ గురించి. స్టోరి లైన్ బాగుంది. కానీ స్టోరికి తగినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, భావోద్వేగ సన్నివేశాల కొరత కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడం వల్ల చిత్రం నుంచి అప్పుడప్పుడు ప్రేక్షకుడు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి.

 

ప్లస్‌ పాయింట్స్‌... విజయ్ ఆంటోనీ నటన, క్లైమాక్స్‌


మైనస్‌ పాయింట్స్‌... స్క్రీన్ ప్లే, వేగం మందగించడం, సంగీతం

 

చివరగా... బిచ్చగాడు రాజకీయ నేతగా ఎదిగాడు. ఎదిగాడు

 

Follow Us:
Download App:
  • android
  • ios