MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajendra Prasad: కాంతారావుని చూస్తే ఎంజీఆర్‌కి వణుకు.. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు

Rajendra Prasad: కాంతారావుని చూస్తే ఎంజీఆర్‌కి వణుకు.. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు

Rajendra Prasad: కత్తి కాంతారావు జాతీయ పురస్కారం నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి వరించింది. ఈ క్రమంలో తాజాగా ఆయన తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 10 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాదాలకు కేరాఫ్‌గా రాజేంద్రప్రసాద్‌
Image Credit : youtube/@dialnewsinfo

వివాదాలకు కేరాఫ్‌గా రాజేంద్రప్రసాద్‌

సీనియర్‌ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఆయన ఇతర నటులపై, నటీమణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్‌ గా మారిపోతున్నారు. ఆ మధ్య అలీపై వల్గర్‌ కామెంట్‌ చేశారు. అలాగే అంతకు ముందు `పుష్ప` సినిమా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చుట్టూ వివాదం నడిచింది. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. అనంతరం కొన్నాళ్లపాటు ఆయన సైలెంట్‌గా ఉన్నారు. వివాదాలకు దూరమయ్యారు. కానీ పద్మ అవార్డులపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పద్మ అవార్డు వరించింది.

25
రాజేంద్రప్రసాద్‌కి కత్తి కాంతారావు జాతీయ అవార్డు
Image Credit : youtube/@dialnewsinfo

రాజేంద్రప్రసాద్‌కి కత్తి కాంతారావు జాతీయ అవార్డు

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి ఇటీవలే పద్మశ్రీ పురస్కారం వరించింది. కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ అత్యన్నత పురస్కారంతో గౌరవించింది. తాజాగా కత్తి కాంతారావు జాతీయ అవార్డు దక్కింది. తెలుగు ఫిల్మ్ టెలివిజన్‌ వెల్ఫేర్‌ ఫోరం ఆధ్వర్యంలో కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం వరించింది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారం రాజేంద్రప్రసాద్‌కి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Related image1
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?
Related image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
35
ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు
Image Credit : youtube/@dialnewsinfo

ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు

కత్తి కాంతారావు గొప్పతనం తెలియజేస్తూ, ఎంజీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కత్తి కాంతారావు కత్తి యుద్ధాలకు కేరాఫ్‌. జానపద చిత్రాలతో విశేష ఆదరణ పొందారు. స్టార్‌గా రాణించారు. కత్తి యుద్ధాలతో కూడిన సినిమాలు చేయాలంటే మొదట వినిపించే పేరు కాంతారావుదే. ఆయన్ని చూసి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి నటులు కూడా వెనకడుగు వేసేవారట. అదే భయం తమిళ హీరోల్లోనూ ఉండేదట. ఈ విషయాలను ప్రస్తావిస్తూ రాజేంద్రప్రసాద్‌ క్రేజీ కామెంట్‌ చేశారు. కత్తి కాంతారావుని చూస్తే ఎంజీఆర్‌కి కూడా `ఉ..` పడేదంటూ వ్యాఖ్యానించారు.

45
రాజేంద్రప్రసాద్‌పై ట్రోల్స్
Image Credit : youtube/@dialnewsinfo

రాజేంద్రప్రసాద్‌పై ట్రోల్స్

`కాంతారావు పేరు చెబితే అమ్మ బాబోయ్‌ అని వణికిపోయేవాడు ఎంజీఆర్‌. ఆయన జానపదాలు చూసి వాడెవడురా బాబోయ్‌, ఇండియన్‌ సినిమాని లేపుకెళ్లిపోతున్నాడు అని భయపోయాడు ఎంజీఆర్‌` అని కామెంట్‌ చేశారు. ఇంకా మాట్లాడుతూ, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు దీటుగా కాంతారావు రాణించారని, అదే సమయంలో వాళ్లతోనూ కలసి సినిమా చేశారని తెలిపారు. వారికి తమ్ముడు రోల్స్, బామ్మర్థి రోల్స్ ఇలా ఇంపార్టెంట్‌ ఏదున్నా కాంతారావుగారే కనిపించేవారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో మొదటి హీరో కాంతారావు అని వెల్లడించారు రాజేంద్రప్రసాద్‌. అయితే కాంతారావు గొప్పతనం చెప్పడం అభినందనీయమే, కానీ మరో హీరోని కించపరిచేలా వ్యాఖ్యానించడం షాకిస్తోంది. దీంతో మళ్లీ రాజేంద్రప్రసాద్‌పై ట్రోల్స్ ఊపందుకున్నాయి. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

55
తెలంగాణ తొలి హీరో కత్తి కాంతారావు
Image Credit : Asianet News

తెలంగాణ తొలి హీరో కత్తి కాంతారావు

కాంతారావు.. తెలంగాణ నుంచి సినిమాల్లోకి వచ్చి హీరోగా రాణించారు. స్టార్‌ హీరోగా ఎదిగారు. నలభై ఏళ్ల సినిమా కెరీర్‌లో 400లకుపైగా చిత్రాల్లో నటించారు. జానపద చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. `నిర్ధోశి`గా కెరీర్‌ని ప్రారంభించారు. ప్రారంభంలో క్యారెక్టర్స్ చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మెప్పించారు. వందకుపైగా చిత్రాల్లో హీరోగా నటించారు. సావిత్రితో కలిసి నటించిన `చివరికి మిగిలేది`లో హీరోగా నటించారు. కాంతారావు చివర్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అంటుంటారు. ఆయన 2009లో మార్చి 22న కన్నుమూశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్
Recommended image2
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?
Recommended image3
Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ గురువుగా భావించింది.. అదే సమయంలో ఆయన్నే ముద్దుగా పిలిచింది..
Related Stories
Recommended image1
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?
Recommended image2
Mahesh Babu: బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన మహేష్‌ బాబు సినిమాని డిజాస్టర్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్‌.. కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved