రీసెంట్ గా తమిళంలో విడుదలైన చిత్రం 'ఇరుతు అరైయిల్ మురతు కుత్తు'. హారర్, కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథ ప్రకారం దెయ్యంగా మారిన ఒక అమ్మాయిని వర్జిన్ అమ్మాయిలతో రొమాన్స్ చేయాలనుకుంటుంది. ఈ డిఫరెంట్ లైన్ తో అక్కడి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి కలిగించడంలో చిత్రబృందం సక్సెస్ అయింది.

ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి నెంబర్స్ ను చూపిస్తోంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన యషిక ఆనంద్ తాజాగా వర్జినిటీ మీద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన ఈ బ్యూటీకి పలురకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నింటికీ బోల్డ్ గా సమాధానాలు చెప్పిన ఈ భామకు.. 'పెళ్ళికి ముందు అమ్మాయిలు వర్జినిటీ కోల్పోవడం కరెక్ట్ అంటారా..?' అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి సమాధానంగా ''అబ్బాయిలు పెళ్ళికి ముందు ఎలా అయితే తమ వర్జినిటీ కోల్పోతారో అమ్మాయిలు కూడా అంతే.. అందులో తప్పేం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది'' అంటూ బోల్డ్ ఆన్సర్ తో షాక్ ఇచ్చింది. ఆమె నుండి ఈ విధమైన స్పందనను ఊహించని వారు పలురకాల కామెంట్స్ చేస్తూ.. తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.