రకుల్ కూడా తెలుగింటి కోడలవుతుందా?

రకుల్ కూడా తెలుగింటి కోడలవుతుందా?

సౌత్ వాళ్లు నార్త్ కోడళ్లు కావడం, నాన్ తెలుగోళ్లు తెలుగింటి కోడళ్లు కావడం కొత్తేమీ కాదు సినిమా రంగంలో. తాజాగా సమంతా రుత్ ప్రభు అక్కినేని వాళ్ల కోడలయింది. ఇంకొక హీరోయిన్ త్వరలో అవుతుందేమో ఎవరూ చూశారు?

సరిగ్గా రకుల్ ప్రీత్ సింగ్ కూడ ఇదే ధ్వనించారు. ఒక చానెల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె తెలుగింటి కోడలు కావడాన్ని పూర్తి కొట్టి పడేయలేదు.ఏమో ఎవరు చూశారూ, తెలుగు  అబ్బాయిని చేసుకుని సమంత లాగా తెలుగింటి కోడలని అవుతానేమో! అన్నారు. రకుల్ కు ఒక సమస్య ఉంది. ఆమె చాలా ఎత్తు. ఎత్తయినా జోడీయే కావాలి.  ఈ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆమె అసక్తి కరమయిన వివరాలు చెప్పారు.

‘నేను కొంచెం ఎత్తుగా ఉంటాను కదా. సహజంగానే ఆరడుగుల ఎత్తు వుండే అబ్బాయినే ఇష్టపడతాను. పెళ్లి చేసుకుంటాను. అయినా ఇంత వరకూ నాకు పెళ్ళి ఆలోచన రాలేదు. తెలుగబ్బాయిని చేసుకుని సమంత లాగా తెలుగువాళ్ల కోడలని అవుతానేమో!  తెలుగింటి కోడలయితే తప్పేంటి?’ అని చమత్కరించారు.

 ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నేనేమీ జ్యోతిష్కురాలానా,  కాదు కద,’ అని రకుల్ అన్నారు.

మొత్తానికి ఆమె మనసు వ్యాకెన్సీ ఉందని దీనిని బట్టి అనుకోవచ్చా?

ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆమె మనుసు దోచుకుంటాడో,  ఎవరిని పెళ్లి చేసుకుంటారో... ప్రస్తుతానికి సస్పెన్సే.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page