Asianet News TeluguAsianet News Telugu

విష్ణు మంచు "ఓటర్" ఫస్ట్ లుక్... రాజకీయాలపై వివాదమా?

  • హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్
  • పోస్టర్ లో రాజకీయ నాయకుల చిత్రాలు
  • ఓటర్ పవరేంటో చూపించే చిత్రం
will voter first look become controversial

హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకుల ముఖచిత్రాలతో నిండి, ఓటర్ గా విష్ణు తన ఇన్క్ వేయబడిన వేలును చూపిస్తున్నట్లున్న ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా పవర్ఫుల్ గా ఉందని ప్రశంసిస్తున్నారందరు. ప్రధాని నరేంద్ర మోది, అటల్ బిహారి వాజ్పాయ్ నుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ మరియు దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో సహా పలువురు ప్రఖ్యాత నేతల ఫొటోలతో కూడిన పోస్టర్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. 

 

జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తికావస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ గా రూపొందుతున్న'ఓటర్' చిత్రంతో విష్ణు తమిళ తెరకు పరిచయం కాబోతున్నారు. తమిళంలో 'కురళ్ 388 ' అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. "ప్రజా స్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర ఓటర్ దే, కానీ అటువంటి ఓటర్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే చిత్రం ఇది. కామన్ పాయింట్ కావడంతో తమిళంలో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. తమిళ తెరకు పరిచయం అయ్యేందుకు విష్ణుకు ఇది మంచి చిత్రం అవుతుందని భావిస్తున్నాను," అన్నారు దర్శకుడు. తమిళ ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో నిండిన 'కురళ్ 388 ' ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా అనూహ్య స్పందన వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు నిర్మాత.

 

ఇతర తారాగణం మరియు సాంకేతిక వర్గం: సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: జాన్ సుధీర్ కుమార్ పూదోట,   కథ-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.

Follow Us:
Download App:
  • android
  • ios