కల్యాణ్‌రామ్- కాజల్ జంటగా నటిస్తున్న ‘MLA’ సినిమా ఈనెల 23న విడుదలవుతోంది. అనేకమంది ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కానీ.. అక్కడో తీర్చలేని వెలితి.‘పటాస్’ దగ్గరినుంచి సోదరుడు కళ్యాణ్ రామ్‌కి వెన్నుదన్నుగా ఉంటూ.. ప్రతి సినిమా ప్రమోషన్లోనూ స్వచ్ఛందంగా పాల్గొనేవాడు తారక్.

 

జూనియర్ ఎన్టీయార్ హీరోగా సొంత బేనర్ మీద ‘జై లవకుశ’ సినిమా తీసిన కళ్యాణ్ రామ్.. తమ బంధం దృఢమైనదని చాటుకున్నాడు. కానీ.. ‘MLA’ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు తారక్ ఎందుకు రానట్టు? ఆ సమయంలో హైదరాబాద్‌లోనే వున్న తారక్.. ‘MLA’ వేడుకకు రాకపోవడానికి కారణమేంటి? అంటూ టాలీవుడ్ వేడివేడిగా మాట్లాడుకుంటోంది. తన ‘స్మార్ట్ బ్రదర్’ అకారణంగా ఏదీ చేయరన్న నమ్మకం మాత్రం కళ్యాణ్ రామ్‌కి ఉంది.

 

ఇదిలా ఉంటే.. తారక్ – త్రివిక్రమ్ డైరెక్షన్లో కొత్త సినిమా ముస్తాబవుతోంది. ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ సెట్స్ మీదికెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రోల్ కోసం తారక్ గెటప్ మారుస్తున్నారని, మేకోవర్ పనుల్లో బిజీగా వున్నాడని, కొత్త లుక్ రివీల్ కాకూడదన్న ఉద్దేశంతోనే ‘MLA’ ఫంక్షన్ కి రాలేదని చెబుతున్నారు. ఒకవైపు త్రివిక్రమ్ మాట.. మరోవైపు తమ్ముడి సినిమా..! తారక్ ఎంత నలిగిపోయ్యుంటాడో కదా!