అతిలోక సుందరి శ్రీదేవి మొదటి జనరేషన్ హీరోలు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు ఇలా అందరితో ఆడిపాడింది. అలాగే సెకండ్ జనరేషన్ టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరితోను నటించి అందరి మన్నులను పొందింది. కానీ ఒక్క బాలక్రిష్ణతో మాత్రం నటించలేదు.చిరు వెంకీ నాగ్ తో నటించిన శ్రీదేవి బాలయ్యతో ఎందుకు నటించలేదు అనేది ఇప్పటికి అర్థం కానీ ప్రశ్నగానే మిగిలింది.

 

అయితే  శ్రీదేవి బాలయ్య కాంబోపై రకరకాల రూమర్స్ ఉన్నప్పటికి అసలు కారణం మాత్రం ఇది అని క్లారిటీ రాలేదు. ఇటీవల శ్రీదేవి మరణించిన నేపథ్యంలో దీనిపై సోషల్ మీడియాలోనే కాక సర్వత్రా చర్చ జరిగింది. ఎన్టీఆర్ తో శ్రీదేవి 1982 లో వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రంలో చివరిసారిగా  నటించింది. ఆ తరువాత బాలయ్య టాలీవుడ్ లో రెండో తరం అగ్ర హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. మిగతా అగ్ర హీరోలతో నటించిన శ్రీదేవి బాలయ్యతో మాత్రం నటించలేదు.

 

ఎన్టీఆర్ శ్రీదేవి హీరోయిన్ గా చాలా సినిమాలే చేసింది. శ్రీదేవి ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది అలాగే హీరోయిన్ గా కూడా నటించింది. నాన్నతో హీరోయిన్ గా చేసి కొడుకుతో చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని బాలయ్య వెనకడగు వేశారు. అప్పుడు ఎన్టీఆర్ కూడా సుముఖంగా లేరని వినికిడి. అందుకే శ్రీదేవితో బాలక్రిష్ణ సినిమా చేయలేకపోయాడు. దర్శక నిర్మాతలు కూడా శ్రీదేవి బాలయ్య కాంబినేషన్ అంటే రిస్క్ అని ఫీల్ అయ్యేవారట. అందుకే శ్రదేవి బాలయ్య కాంబినేషన్ లో సినిమా రాలేదు.