రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

why ramcharan rangasthalam shooting stopped
Highlights

  • రంగస్థలం మూవీ షూటింగ్ వాయిదా
  • రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం
  • సైరా సినిమా కోసం రంగస్థలం చిత్రానికి బ్రేక్ వేసిన చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం. ఈ మూవీని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొల్లేరు గ్రామాల్లో తెరకెక్కిన ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని ఓ విలేజ్ సెట్టింగులో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. దానికి కారణం...

 

మెగాస్టార్ నటించనున్న సైరా సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు జరగనున్న ఈ ఫస్ట్ షెడ్యూల్‌కు అందుబాటులో వుండటం కోసమే రంగస్థలం సినిమా షూటింగ్‌కి బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్. సైరా సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నిర్మాతగా తాను ఫస్ట్ షెడ్యూల్ బాధ్యతలు చూసుకోవాలి. మరోవైపు రంగస్థలం సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు సైరా సినిమాకు కూడా పని చేస్తున్నాడు. అందువల్లే రంగస్థలం చిత్రం షూటింగ్ ఈ బ్రేక్ వేయక తప్పలేదని తెలుస్తోంది.

 

సైరా ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత మళ్లీ రంగస్థలం చివరి షెడ్యూల్‌కి హాజరుకానున్న చెర్రీ.. అదే షెడ్యూల్లో మిగిలిన మూడు పాటల షూటింగ్ పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ నెలాఖరులోగా ఆ మూడు పాటల షూటింగ్ పూర్తి చేయగలిగితే మళ్లీ ఆ తర్వాత సైరా షూటింగ్ రెండో షెడ్యూల్లో పాల్గొనవచ్చని చెర్రీ ఆలోచనగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

loader