పెళ్లి కోసమే సినిమాలకు గ్యాప్ ఇస్తోందా?

why deepika padukone not accepting new film
Highlights

స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతుంది 

స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతుంది దీపికా పడుకోన్. అగ్ర హీరో సినిమాలలో హీరోయిన్ అంటే ముందుగా దీపికానే సంప్రదిస్తుంటారు. అలాంటిది ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమె నటించిన 'పద్మావత్' సినిమా విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా విడుదలైన తరువాత భారీ వసూళ్లను సాధించింది.

ఈ సినిమా విడుదలయ్యి నాలుగు నెలలు గడిచిపోయాయి. కానీ ఈ బ్యూటీ ఇప్పటివరకు మరే సినిమాకు సైన్ చేయలేదు. షారుఖ్ ఖాన్ నటిస్తోన్న 'జీరో' సినిమాలో స్పెషల్ రోల్ తప్పించి దీపికా చేతిలో మరో సినిమా లేదు. డిమాండ్ లో ఉండే స్టార్ హీరోయిన్లు ఇంత ఖాళీ ఉండడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దానికి కారణం ఆమె రెమ్యునరేషన్ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనతో సినిమాలు తగ్గించిందని అంటున్నారు.

హీరోలతో సమానంగా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని టాక్. ఇక చాలా కాలంగా రన్ వీర్ సింగ్ తో ప్రేమలో ఉన్న దీపికా ఎట్టకేలకు ఆయనతో పెళ్లికి రెడీ అవుతుందని అందుకే సినిమాల విషయంలో గ్యాప్ వస్తుందనేది మరికొందరి మాట. 
 

loader