త్రివిక్రమ్ కావాలనే ట్రైలర్ వదలడం లేదట!

First Published 18, Dec 2017, 6:34 PM IST
Why Agnyaathavaasi Trailer release delayed
Highlights

అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ లో జాప్యం ఎందుకు?

త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'అజ్ఞాతవాసి' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డులు తిరగరాస్తోంది. రేపు(డిసంబర్ 19) హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, మిగిలిన పాటలను ఆడియో ఫంక్షన్ లో విడుదల చేయనున్నారు. అయితే ఆడియో రోజే సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ అలా చేయడం లేదట. ఫైనల్ కట్ రెడీగా లేకపోవడంతో ట్రైలర్ వాయిదా వేస్తున్నారనే మాటలు వినిపించినా.. దీని వెనుక మరో స్టోరీ ఉందట. నిజానికి ట్రైలర్ విడుదల చేసే ఆలోచన త్రివిక్రమ్ కు లేదట. 

కావాలనే ఆయన వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా.. అది బాగా వైరల్ అవుతుంటుంది. కొద్దిరోజుల పాటు ట్రెండ్ లో ఉంటుంది. ఇప్పటికే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రేపు పాటలు విడుదల చేసిన తరువాత కొద్దిరోజులు అభిమానులు అదే మ్యానియాలో ఉంటారు. ఆ తరువాత క్రిస్మస్ కానుకగా ట్రైలర్ విడుదల చేస్తే న్యూఇయర్ వరకు ఆ హైప్ ఉంటుందని ఆ తరువాత ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై బజ్ మరింత పెరుగుతుందని ప్లాన్ చేస్తున్నారు. అదన్నమాట మేటర్. త్రివిక్రమ్ తెలివిలో భాగంగా ట్రైలర్ ను వాయిదా వేస్తున్నారు. 

loader