అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత కొన్ని ప్రశ్నలు ఆమెతోపాటు కాల గర్భంలో కలిసిపోయేలా కనిపిస్తున్నాయి. శ్రీదేవి ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని హోటల్ లో బాత్ టబ్ లో పడి ఆశ్చర్యకరమైన రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం తరువాత దుబాయ్ లో పెద్ద హైడ్రామానే జరిగింది. కొన్ని రోజుల హడావిడి తరువాత శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారని అక్కడి ప్రభుత్వం తేల్చేసింది. కానీ శ్రీదేవి మరణం విషయంలో మాత్రం అభిమానులకు పూర్తి వివరాలు తెలియకుండా చేశారనే వాదన ఉంది. ఇదిలా ఉంటె శ్రీదేవి మృతితో ఆమె అభిమానులు ఎంతగానో మదన పడ్డారు. సినీరాజకీయ ప్రముఖులు వేలాదిగా తరలివచ్చి శ్రీదేవికి నివాళులు అర్పించారు. కానీశ్రీదేవి చెల్లెలు శ్రీలత మాత్రం అంత్యక్రియలకు హాజరు కాలేదు.

1993 దాకా మంచి అనుబంధం కొనసాగించిన శ్రీదేవి శ్రీలత అమ్మానాన్న ఒకరి తరువాత ఒకరు కాలం చేసాక విడిపోయారు. సుమారు పదేళ్ళ క్రితం తిరిగి కలుసుకున్న ఈ అక్కా చెల్లెళ్ళు అప్పటి నుంచి టచ్ లోనే ఉన్నారు. శ్రీదేవి దుబాయ్ పెళ్ళికి వెళ్ళాక అదే పనిగా శ్రీలతను కలవాలనుందని చెప్పి అక్కడికి రప్పించుకుందట. శ్రీదేవి చివరి ఘడియల్లో పక్కనే ఉన్నవాళ్ళలో శ్రీలత కూడా ఉన్నారని సమాచారం. బోనీ కపూర్ వచ్చాక శ్రీలత తన రూమ్ కు వెళ్ళిపోయిందని ఆ తర్వాతే ఈ ఘోరం చోటు చేసుకుందని ఇన్ సైడ్ టాక్. కాని ముంబై అంత్యక్రియల్లో శ్రీలత జాడ లేదు. ఆమె భర్త సతీష్ కూడా కనిపించలేదు. కారణం కపూర్ ఫ్యామిలీ అభ్యర్తనే అని తెలిసింది. మీడియాకు కనిపించకుండా ఈ జాగ్రత్త వహించినట్టు తెలిసింది. చెన్నైలో శ్రీదేవి పేరిట ఉన్న ఆస్తిని ఆ దంపతుల పేరిట బోనీ రాయబోతున్నట్టు టాక్.

ఇక శ్రీదేవి మరణం విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదని మినిస్ట్రీ అఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ స్పోక్స్ పర్సన్ రావీష్ కుమార్ స్పష్టం చేసారు. దుబాయ్ ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా సమాచారం అందుకున్నాకే ఆమె మరణంలో ఎటువంటి అసహజత లేదని నిర్ధారణకు వచ్చామని ఇకపై ఎటువంటి అనుమానాలకు తావు లేదని తేల్చి చెప్పారు. ఇక్కడి పోలీసుల విచారణ అవసరం లేదని తేల్చేసారు.