భర్త కోసం లక్ష్మీ మంచు పోరాటం!

w/o ram movie trailer talk
Highlights

కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మంచు లక్ష్మీ త్వరలోనే 'W/O రామ్' చిత్రంతో

కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మంచు లక్ష్మీ త్వరలోనే 'W/O రామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ ను బట్టి ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగనుందని తెలుస్తోంది.

తన భర్తను లోయలో పడేసిన వ్యక్తిని పట్టుకోవాలని తనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది మంచు లక్ష్మి. ట్రైలర్ ను అయితే ఆసక్తికరంగా కట్ చేశారు. మరి అదే ఆసక్తి కథతో కలిగించగలిగితే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. విజయ్ ఏలకంటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆదర్శ్ బాలకృష్ణ. ప్రియదర్శి, సామ్రాట్ రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 
 

loader