49 ఏళ్ళ బాలీవుడ్ హీరో హైదరాబాద్‌లో జన్మించారు. స్టార్ కిడ్ అయినప్పటికీ సినిమాల్లో సక్సెస్ కాలేకపోయారు. కాని 1200 కోట్ల ఆస్తిని సంపాదించాడు ఎవరా హీరో
49 ఏళ్ళ వివేక్ ఒబెరాయ్ పూర్తి పేరు వివేక్ ఆనంద్ ఒబెరాయ్. ఆయన యాక్టర్ గానే కాకుండా బిజినెస్ మెన్ కూడా. 2002లో 'కంపెనీ' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత సక్సెస్ ని నిలబెట్టుకోలేక ఫ్లాప్ హీరో అయిపోయారు. అయితే, బిజినెస్ లో మాత్రం బాగా రాణించి 1200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
వివేక్ ఒబెరాయ్ ఆస్తి, బిజినెస్
సల్మాన్ ఖాన్ తో వివాదం, వరుస ఫ్లాప్ లతో కెరీర్ డౌన్ అయిపోయింది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా, బిజినెస్ లో రాణించారు. రియల్ ఎస్టేట్, ఎడ్-టెక్, జ్యువెలరీ, అగ్రికల్చర్ టెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి 1200 కోట్ల ఆస్తి సంపాదించారు. UAE లో తన లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీ 7 బిలియన్ డాలర్ల ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డైమండ్ ల్యాబ్ కంపెనీ కూడా ఉంది. ముంబైలో 2100 స్క్వేర్ ఫీట్ల బంగ్లా, దుబాయ్ లో కూడా ఇల్లు ఉన్నాయి. ముంబై ఇంటి విలువ 14.25 కోట్లు. వివేక్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతనికి లంబోర్గిని గల్లార్డో, క్రిస్లర్ 300C లిమోసిన్, రెండు మెర్సిడెస్ మోడల్స్ (GLS 350d , GLE 250d), రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు ఉన్నాయి.
వివేక్ ఒబెరాయ్ సినిమా కెరీర్
'వివేక్ ఒబెరాయ్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ కంపెనీతో బాలీవుడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. దీని తర్వాత, అతను రాణి ముఖర్జీతో కలిసి రొమాంటిక్ చిత్రం సాథియాలో కనిపించాడు. ఆ తర్వాత అతను కామెడీ చిత్రం మస్తి (2004), హారర్ చిత్రం కాల్ (2005), యాక్షన్ థ్రిల్లర్ షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా (2007), క్రైమ్ డ్రామా ఓంకారా (2006) , కుర్బాన్ (2009) వంటి చిత్రాలలో నటించాడు. బాలీవుడ్‌తో పాటు, వివేక్ దక్షిణ చిత్రాలలో పనిచేశాడు. అతను వివేగం (2017), లూసిఫర్ (2019), వినయ విధేయ రామ (2019) కడువ (2022) అనే యాక్షన్ చిత్రాలలో విలన్ పాత్రలో కనిపించాడు.
వివేక్ ఒబెరాయ్ వ్యక్తిగత జీవితం
వివేక్ ఒబెరాయ్ పూర్తి పేరు వివేకానంద. స్వామి వివేకానంద అంటే ఆయన తండ్రి, తాతలకి చాలా ఇష్టం. సినిమాల్లోకి వచ్చాక ఆనంద్ అనే పేరు తీసేసారు. 'క్యూଁ! హో గయా నా...' సినిమాలో ఐశ్వర్య రాయ్ తో ప్రేమాయణం నడిచింది. 2003 లో సల్మాన్ ఖాన్ తనని బెదిరించాడని వివేక్ ఆరోపించారు. 2005 లో ఐశ్వర్యతో బ్రేకప్ అయ్యింది. 2010 లో ప్రియాంక అల్వాని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు.


