MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జయం సినిమాలో ఈ కమెడియన్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో అడుగు పెట్టబోతున్నాడని మీకు తెలుసా?

జయం సినిమాలో ఈ కమెడియన్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో అడుగు పెట్టబోతున్నాడని మీకు తెలుసా?

ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరింత రసవత్తరంగా మారబోతోంది. ఈసారి బిగ్ బాస్ లో అడుగు పెట్టబోయేవారి పేర్ల విషయంలో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. ఈక్రమంలోనే జయం సినిమాలో నటించిన ప్రముఖ కమెడియన్ పేరు ఈ లిస్ట్ లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హాస్యనటుడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 03 2025, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : biggboss9telugunews/Instagram

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9పై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. "సిలబస్ మార్చేశాం" అనే ట్యాగ్‌లైన్‌తో ఈసారి మరింతగా ఇంట్రెస్ట్ ను పెంచేసిన టీమ్, అభిమానుల్లో క్యూరియాసిటీని ఇంకాస్త పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి contestants విషయంలో చాలా టైట్ చేసిన టీమ్, వారి ఎంపికలో గట్టిగా గోప్యత పాటిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇద్దరు ప్రముఖుల పేర్లు హాట్ టాపిక్‌గా మారాయి. బిగ్ బాస్ లో అడుగు పెట్టబోయే సెలబ్రిటీల విషయంలో రోజుకో పేరు వినిపిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Image Credit : Asianet News

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ నటి ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్వేత వర్మ లు ఈ సీజన్‌కి ఖచ్చితంగా ఎంపికైనట్టుగా టాక్ నడుస్తోంది. అలాగే మరికొంత మంది పాపులర్ ఎంటర్‌టైనర్లు కూడా ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. సీరియల్ యాక్ట్రస్ నవ్య స్వామి లాంటి ప్రముఖుల పేర్లు వినిపింస్తున్నాయి. యూట్యూబర్లు, ఇన్ స్టా సెలబ్రిటీలు కొంత మంది ఈ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం. ఈక్రమంలోనే ఓ టాలీవుడ్ కామెడియన్ పేరు కూడా ఈ లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తోంది.

Related Articles

Related image1
అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?
Related image2
20 ఏళ్లైనా టిఆర్పి లో దుమ్మురేపుతున్న వెంకటేష్ సినిమా ఏదో తెలుసా?
35
Image Credit : Asianet News

మరీ ముఖ్యంగా ఈ లిస్ట్ లో ‘జయం’ సినిమా కమెడియన్ సుమన్ శెట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2002లో విడుదలైన ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు సుమన్ శెట్టి. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించిన సుమన్, ఆ సినిమాలోని తన పాత్రకు గాను నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అదే ఎనర్జీని తీసుకురానున్నారని భావిస్తున్నారు.

45
Image Credit : Jiosaavn

ఇక యూట్యూబ్ సెన్సేషన్ అయిన జానపద గాయకుడు రాము రాథోడ్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘రాను బొంబాయికి రాను’ పాటతో సోషల్ మీడియాలో తక్కువ సమయంలోనే లక్షలాది వ్యూస్ సంపాదించిన రాము రాథోడ్ కూడా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో తన గానంతో అలరించనున్నట్టు సమాచారం.

55
Image Credit : star maa promo

ఈ ఇద్దరితో పాటు, లక్స్ పాప ఫేమ్ ఫ్లోరా సైని, జబర్దస్త్ కామెడియన్ ఇమ్మాన్యుయేల్, నటుడు భరణి, తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ దీపిక రంగరాజు వంటి పాపులర్ సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.గత ఏడాది సీజన్ 8లో పెద్దగా గుర్తింపు లేని వ్యక్తులు హౌస్‌లో ఉండటంతో ప్రేక్షకుల్లో ఆ ఆసక్తి తగ్గిపోయింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి నిర్వాహకులు పాపులర్ ఫేసెస్‌తో బిగ్‌బాస్ 9ని మరింత గ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, సెలబ్రిటీల ఎంపికపై జరిగే అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో షో ప్రసారం ప్రారంభం కానున్న అవకాశం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
అక్కినేని నాగేశ్వరరావు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఇప్పుడు ఏం కొనొచ్చు?
Recommended image2
20 ఏళ్లైనా టిఆర్పి లో దుమ్మురేపుతున్న వెంకటేష్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved