లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం2' సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 10న సినిమా విడుదలవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడనున్నట్లు సమాచారం.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించడంతో తన సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడట కమల్. పైగా కరుణానిధి మరణించడంతో థియేటర్లు రెండు రోజుల పటు స్వచ్ఛదంగా బంద్ పాటిస్తుండడంతో తమిళనాడులో సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా వాయిదా వేయడమే కరెక్ట్ అని భావించిన కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ విషయంపై అధికార ప్రకటన వెలువడాల్సివుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.