కమల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'విశ్వరూపం' ఒకటి. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, కమల్ చేసిన సాహసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దాంతో కమల్ ఈ సినిమాకి సీక్వెల్ ను కూడా సిద్ధం చేశారు. అయితే కొన్ని ఆర్ధిక పరమైన లావాదేవీల కారణంగా ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది.

ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో కమల్ గట్టి ప్రయత్నమే చేశారు. ఆయన ప్రయత్నాలు ఫలించి .. అడ్డంకులు తొలగిపోయి, ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. యూఎస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో జూన్ లో విడుదల చేయనున్నారు.