విశ్వక్‌ సేన్‌ హీరోగా `ఓరి దేవుడా` అంటున్నాడు. తాను నటిస్తున్న కొత్త చిత్ర ఫస్ట్ లుక్‌, మోషన్ని‌  విడుదల చేశారు. ఫన్నీగా ఉన్న ఈ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

`ఫలక్‌నూమా దాస్`, `హిట్‌` చిత్రాలతో విజయాలు అందుకుని సునామీలా దూసుకొచ్చాడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen). స్వతహాగా హీరోగా ఎదిగిన ఆయన ఇటీవల `పాగల్‌` చిత్రంతో నిరాశ పరిచాడు. ఇప్పుడు మరోసారి లవ్‌ స్టోరీతో రాబోతున్నారు Vishwak Sen. ఆయన నటిస్తున్న నూతన చిత్రం `ఓరి దేవుడా`(Ori Devuda) టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని మంగళవారం విడుదల చేశారు. మల్లారెడ్డి మహిళా కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ చిత్ర టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. 

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న Ori Devuda చిత్రంలో మిథిలా పల్కర్‌, ఆషా భట్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన `ఓ మై కదువులే`కి రీమేక్‌ కావడం విశేషం. మాతృక చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వత్‌ మరిముత్తు ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. నేటి తరం అమ్మాయి అబ్బాయిల మధ్య రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

Scroll to load tweet…

మాతృకలోని ప్రధాన భాగాన్ని తీసుకుని తెలుగు ఆడియెన్స్ టేస్ట్ కి దగ్గట్టు కథలో మార్పులు చేసినట్టు చెప్పారు దర్శకులు. ఇది యూత్‌కి మాత్రమే కాదు, అయితే ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందన్నారు. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. తాజాగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో క్రిస్టియన్‌ పెళ్లిని తలపించేలా ముస్తాబైన హీరో,హీరోయిన్ల లుక్‌ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి `పెళ్లి చూపులు` ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ డైలాగులు రాస్తుండటం విశేషం. 

సినిమాకి లియోన్‌ జేమ్స్ సంగీతం అందించగా, విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ ఎడిటర్‌గా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. వంశీ కాకా ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్‌, మోషన్‌ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. విశ్వక్‌ సేన్‌ కూడా గత చిత్రాలతో పోల్చితే చాలా కొత్తగా కనిపించబోతున్నాడని తాజా లుక్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. 

also read: జీవితంలో ఓ మెమరీ ఉండాలనుకున్నాః కార్తికేయ.. కాబోయే భార్యకి లవ్‌ ప్రపోజ్‌పై `రాజావిక్రమార్క` హీరో రియాక్షన్‌