Asianet News TeluguAsianet News Telugu

జీవితంలో ఓ మెమరీ ఉండాలనుకున్నాః కార్తికేయ.. కాబోయే భార్యకి లవ్‌ ప్రపోజ్‌పై `రాజావిక్రమార్క` హీరో రియాక్షన్‌

తన కాబోయే భార్యకది సర్‌ప్రైజింగ్‌గా ఉండాలని తాను `రాజా విక్రమార్క` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రపోజ్‌ చేశానని తెలిపాడు హీరో కార్తికేయ. అయితే అది అప్పటికప్పుడు అనుకున్నాడట. 

hero kartikeya react on his love propose to fiance lohitha
Author
Hyderabad, First Published Nov 9, 2021, 7:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హీరో కార్తికేయ(Kartikeya) ఇటీవల తాను నటిస్తున్న `రాజా విక్రమార్క`(Raja Vikramarka) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్య లోహితకి స్టేజ్‌పైనే ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కార్తికేయ స్పందించారు. లైఫ్‌లో ఒక మెమరీ ఉండిపోవాలని అలా ప్లాన్‌ చేసినట్టు చెప్పాడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేదని, ఇన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్‌ చేయలేదని, ఫోన్‌లో ఇష్టమని చెప్పడం తప్ప, ఐ లవ్‌ యూ అని కూడా చెప్పలేదన్నాడు. పెళ్లి అయిపోతుంది, మళ్లీ అవకాశం రాదని, జీవితాంతం మా ఇద్దరికీ ఒక మెమరీలో ఉంటుందని, తనకు సర్‌ప్రైజ్‌ ఇచ్చినట్టు ఉంటుందని స్టేజ్‌ పై ప్రపోజ్‌ చేసినట్టు Kartikeya చెప్పాడు. 

కార్తికేయ, తాన్య రవిచంద్రన్‌ జంటగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం Raja Vikramarka.  శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో కార్తికేయ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో తాను ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా కనిపిస్తానని, యాక్షన్‌తోపాటు కామెడీ పంచే పాత్ర తనదని చెప్పాడు. తాను స్వతహాగా ఫన్‌ గోయింగ్‌ పర్సన్‌ అని దీంతో కామెడీ పండించడం పెద్ద కష్టమేమీ అనిపించలేదన్నారు. 

చిరంజీవి నటించిన `రాజా విక్రమార్క` టైటిల్‌ పెట్టడంపై ఆయన స్పందిస్తూ, `దర్శకుడు శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. 'రాజా విక్రమార్క' టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ... చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు. టైటిల్ పెట్టిన తర్వాత చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేసిన తర్వాత చిరంజీవిగారికి పంపించాను. 'గుడ్ లక్' అని చెప్పాను. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నా` అని చెప్పాడు.    

ప్రస్తుతం కార్తికేయ తమిళంలో అజిత్‌తో కలిసి `వాలిమై` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విలన్‌ పాత్రని పోషిస్తున్నాడు. అజిత్‌తో వర్క్ చేయడంపై స్పందిస్తూ, ఫ‌స్ట్ డే అజిత్ గారితో నా కాంబినేష‌న్ సీన్స్ లేవు. నార్మల్ షూట్ చేశారు. సెకండ్ డే అజిత్ గారితో సీన్స్ తీశారు. ఆయన్ను కలిసే ముందువరకూ కొంచెం టెన్షన్ ఉంది. నాకు తెలియని లాంగ్వేజ్. ఆయన పెద్ద స్టార్. ఎలా ఉండాలో, ఏంటో? అని. ఆయన్ను కలిసిన ఒక నిమిషంలో చాలా  కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండొచ్చ‌నే వైబ్ ఇచ్చేశారు. స్టార్ అన్నట్టు బిహేవ్ చేయరు. దాంతో నేను ఈజీగా నటించా. ఈ సినిమా కోసం తమిళ్ కొంత నేర్చుకున్నాను. డబ్బింగ్‌ కూడా చెప్పాను` అని అన్నాడు. 

`వాలిమై` చిత్రంలో స్టంట్స్, యాక్షన్ దృశ్యాలు చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకు చేయని స్టంట్స్ చేశా. ఇండియన్ సినిమాలో అయితే నేను అటువంటి స్టంట్స్ చూడలేదు. బాలీవుడ్ 'వార్' సినిమాలో గ్రాండియర్ ఉంది. రిస్కీ షాట్స్, మేకింగ్... డిఫెరెంట్ గా చేశారు. అవి చూసి నేనూ చేయాలని ఇన్స్పైర్ అయ్యాను. అజిత్ గారితో చేయడం కొంచెం కష్టమే. ఒక స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నా ముందే ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు భయమేసింది. యాక్షన్ చేసేటప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. ఇచ్చానని అనుకుంటున్నాను.   

తన బాడీ మెయింటనెన్స్ పై వస్తోన్న కంప్లీమెంట్స్ పై స్పందిస్తూ, `నా బాడీ, ఫిజిక్ వల్లే 'ఆర్ఎక్స్ 100' ఛాన్స్ వచ్చింది. తర్వాత 'గ్యాంగ్ లీడర్' దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో 'నన్ను ఎందుకు తీసుకున్నారు?' అని అడిగా. 'నీకు మంచి బాడీ ఉంది' అన్నారు. ఇప్పుడు 'వలిమై'లో కూడా అందుకే తీసుకున్నారు. బాడీ వల్ల నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. దర్శకులు నన్ను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏదైనా అవ్వొచ్చు. బాడీ ఉందని నన్ను తీసుకున్నానని చెప్పిన ముగ్గురు దర్శకులు... నా నటన చూసినప్పుడు, ఎమోషనల్ సీన్స్ చేసినప్పుడు, నటనలో ఇంటెన్స్ చూసి స‌ర్‌ప్రైజ్‌ అయ్యామని చెప్పారు. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయ్యింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి. బాడీ అలా మెయింటైన్ చెయ్యడం కష్టమే` అని చెప్పారు.

నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, `యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత క్లాక్స్ అని అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. శివలెంక కృష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయ్యింది. అన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలు. 'వలిమై' సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందులో నటించడం వల్ల తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయ`ని చెప్పాడు కార్తికేయ. 

also read: `రాజావిక్రమార్క` ఈవెంట్‌లో కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. లవ్‌ స్టోరీ కూడా చెప్పేశాడు..

Follow Us:
Download App:
  • android
  • ios