సారాంశం

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. చిత్ర పరిశ్రమకి చెందిన వారికి కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. దీనితో తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతు దారులు అడుగడుగునా ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చిత్ర పరిశ్రమకి చెందిన వారికి కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

ఇటీవల సురేష్ బాబుని ప్రశ్నించగా సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు అరెస్ట్ గురించి ఎందుకు స్పందించాలి అని అన్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. కానీ చంద్రబాబు అరెస్ట్ గురించి సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ రాజకీయాలు వద్దు అని అన్నారు. 

అయితే తాజాగా హీరో విశాల్ చంద్రబాబు అరెస్ట్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైదరాబాద్ లో మార్క్ ఆంటోని సక్సెస్ ప్రెస్ మీట్ లో విశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నించారు. విశాల్ సమాధానం ఇస్తూ.. నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాడులో వేశా. చంద్రబాబుని పోలీసులు ఒక కేసు విషయంలో అరెస్ట్ చేశారు. 

ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ప్లోలీసులు ఇంకాస్త కసరత్తు చేసి ఆలోచించాల్సింది. ఒక చంద్రబాబు లాంటి వ్యక్తికే ఇలా జరిగితే నాలాంటి సామాన్యుడికి భయం వేస్తుంది. చంద్రబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని తెలుస్తోంది. చివరకి న్యాయమే గెలుస్తుంది. దానికోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ విశాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.