స్టార్ హీరో విశాల్ సామాన్యుడు సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. ఫ్యాన్స్ కు మంచి మాస్ టీజర్ ట్రీట్ ఇచ్చాడు విశాల్.

త‌మిళ్ స్టార్ హీరో తెలుగు కుర్రాడు విశాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త‌మిళ్ తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో విశాల్‌... జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విశాల్. కోవిడ్ టైమ్ లో కూడా ధైర్యంగా షూటింగ్ చేసుకున్న విశాల్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు.

 అయితే.. ప్రస్తుతం విశాల్ హీరోగా తెర‌కెక్కుతున్న తెరకెక్కుతున్న 31 వ సినిమా సామాన్యుడు. నాట్ ఏ కామ‌న్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్‌ తో రూపొందుతున్న ఈమూవీ పై అంచానాలు బారీగానే ఉన్నాయి. ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ద్వారా తుపా శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. దర్శకుడు కథ చెప్పిన విధానాన్ని బట్టి.. ఆయన టాలెంట్ ను గుర్తించి విశాల్ సినిమా అవకాశం ఇచ్చారు.

Also Read : 2021 మిస్ అయినా... నెక్ట్స్ ఇయర్ అంతకు మించి ట్రీట్ ఇస్తామంటున్న స్టార్ హీరోలు

విశాల్ ఫిల్మ్ ప్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై విశాల్ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇటీవ‌లే విశాల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సామాన్యుడు సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. తాజాగా మ‌రో బిగ్ అప్డేట్ ను రిలీజ్ చేశారు మూవీటీమ్. సామాన్యుడు సినిమా నుంచి టీజ‌ర్ ను వ‌దిలారు. ఈ టీజ‌ర్ లో కామ‌న్ మ్యాన్ గా క‌నిపించిన.. హీరో విశాల్‌.. యాక్ష‌న్ సీన్ల‌తో రెచ్చి పోయారు. అలాగే ఎమోష‌న‌ల్ సీన్లు కూడా అదరగొట్టారు.

AlsoRead : Sunny Leone: సన్నీ లియోన్ క్షమాపణలు చెప్పు.. బ్రహ్మణ సంఘాల డిమాండ్. సన్నీ ఏం చేసింది..?

తెలుగు,తమిళ బాషల్లో తెరకెక్కుతున్న ఈమూవీలో డింపుల్ హతి హీరోయి గా నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సామాన్యుడు సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇప్పటి వరకూ ఈమూవీ నుంచి రిలీజ్ చేసిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమూవీలో యోగిబాబు, జాకబ్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు.