తమిళనాడు రాష్ట్రంలో ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ కూడ బరిలోకి దిగుతున్నాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత విశాల్ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు వెళ్ళాడు. ఎంజీఆర్ తదితరుల విగ్రహాలకూ పూలమాల వేసి నివాళులర్పించాడు విశాల్. ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారంది. విశాల్ పోటీ నిర్ణయం తమిళ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.

 

తమిళహీరో విశాల్ తెలుగువాడే. విశాల్ కుటుంబం కొంత కాలం హైద్రాబాద్‌లో నివసించింది. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి, విశాల్ అని ముద్దుగా పిలుస్తారు. జికె రెడ్డి,జానకి దేవి దంపతుల కొడుకు విశాల్. 1977 ఆగష్టు 29న విశాల్ పుట్టాడు. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ సినిమా రంగంతో సంబంధాలున్నాయి. విశాల్‌కు ఇద్దరు చెల్లెల్లున్నారు.

 

విశాల్ కుటుంబం హైద్రాబాద్‌లో నివసించే సమయంలో విశాల్ బాల్యంలో హైదరాబాదులోని దిల్‌షుర్‌నగర్ పబ్లిక్ స్కూల్లో చదివాడని చెబుతారు. ఆ తర్వాత విశాల్ కుటుంబం హైద్రాబాద్‌ నుండి చెన్నైకు మకాం మార్చారు. దీంతో విశాల్ చదువంతా చెన్నైలోనే సాగింది. విశాల్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను చెన్నైలోని డాన్ బోస్కో మెట్రిక్యులేన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత లయోలా కాలేజీ నుంచి విజ్వల్ మీడియాలో డిగ్రీ చేశారు.

 

విశాల్ తండ్రి,నిర్మాత జికె రెడ్డి పలు తమిళ, తెలుగు సినిమాలను నిర్మించారు. అన్న విక్రమ్ కృష్ణ విశాల్ నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాల కారణంగానే జికెరెడ్డి తన నివాసాన్ని హైద్రాబాద్ ‌నుండి చెన్నైకు మార్చారని చెబుతారు. ఆయన కొడుకు విక్రమ్ కృష్ణ కూడ సిని రంగంలోనే కొనసాగాడు. అదే బాటలో విశాల్ కూడ పయనించాడు.

 

దక్షిణ భారత సినీ నటుల సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ ప్యానెల్‌ను విశాల్ ప్యానెల్ ఓడించి సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల సమయంలో సినీ నటి రాధిక విశాల్ తెలుగు వాడని ప్రచారం కూడ చేసింది. అయినా ఆ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ భారీ విజయాన్ని సాధించింది. అయితే శరత్‌కుమార్‌కు వ్యతిరేక వర్గమంతా విశాల్ వెంట నడిచారు. దీంతో ఈ ఎన్నికల్లో విశాల్ ప్యానెల్ విజయం సాధించింది.

 

ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో అనుహ్యంగా విశాల్ బరిలోకి దిగాడు. అయితే ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో హట్ టాపిక్‌గా మారింది. అయితే విశాల్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో విశాల్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడ చేస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.