ప్రముఖ హీరో, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కు, కొంతమంది నిర్మాతలకు మధ్య చోటుచేసుకున్న విభేదాలు వివాదానికి దారితీస్తున్నాయి. కొందరు నిర్మాతలు విశాల్ కి ఎదురుతిరిగి అతడిని నిర్మాతల మండలి అద్యక్ష పదవి నుండి రాజీనామా చేయమంటున్నారు.

ఈ క్రమంలో నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో గురువారం నాడు ఆ తాళాన్ని పగులగొట్టి లోనికి వెళ్లే ప్రయత్నం చేశాడు విశాల్. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేశారు.

దీనిపై స్పందించిన విశాల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ''నిర్మాతల మండలితో సంబంధం లేని వ్యక్తులు నిన్న కార్యాలయం తలుపులు, గేట్లు మూసేస్తుంటే సైలెంట్ గా ఉన్న పోలీసులు.. ఈరోజు నన్ను, నా సహోద్యోగులను మా తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారు.

ఇది నిజంగా షాకింగ్ గా ఉంది. నమ్మలేకపోతున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం మా ప్రయత్నాన్ని వదిలిపెట్టం. కచ్చితంగా పోరాడతాం.. ఇళయరాజా గారి ఈవెంట్ ని ఎలాగైనా నిర్వహించి, దాని ద్వారా వచ్చే నిధులతో నష్టాల్లో ఉన్న నిర్మాతలను ఆదుకుంటాం'' అంటూ వెల్లడించింది.  

బ్రేకింగ్: నటుడు విశాల్ అరెస్ట్..!