గోల్డెన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సర్ ప్రైజ్ ఇచ్చిన అనిల్ కుంబ్లే

First Published 26, Dec 2017, 10:05 PM IST
virat kohli anushka sharma wedding reception surprised by anil kumble
Highlights
  • గోల్డెన్ వెడ్డింగ్ ట్వీట్ గా ఘనత సాధించిన అనుష్క విరాట్ వివాహ ట్వీట్
  • తాజాగా ముంబైలో విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్
  • రిసెప్షన్ కు హాజరై సర్ ప్రైజ్ ఇచ్చిన అనిల్ కుంబ్లే

ఇటీవలే డిసెంబర్ 11న ఇటలీలో ఒక్కటైన సెలెబ్ జంట విరాట్, అనుష్కల వెడ్డింగ్ ట్వీట్ ఈ యేటి గోల్డెన్ ట్వీట్ గా అవతరించింది. ఇక ఈ వివాహానికి సంబంధించి ముంబైలో విరుష్క జంట విందు ఘనంగా ప్రారంభమైంది. దీని కోసం సెయింట్ రెజిస్‌లోని లోయర్ పారెల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇటీవలే పెళ్లి బంధం ద్వారా ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. మంగళవారం (డిసెంబర్ 26) సాయంత్రం ముంబైలో మరోసారి వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది.

 

ఢిల్లీలో ఇప్పటికే ఒకసారి వివాహ విందు ఇచ్చిన విరుష్క జోడీ.. క్రికెటర్లు, వివిధ రంగాల ప్రముఖుల కోసం దేశ ఆర్థిక రాజధానిలో మరోసారి విందు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ విందుకు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా హాజరై ఆశ్చర్యపరిచారు. విరాట్‌ కారణంగానే కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆయన మళ్లీ ఈ విందు ద్వారా భారత సారథిని కలుసుకోవడంతో సర్వతా ఆసక్తిగా మారింది.డిసెంబర్ 21న బంధువులు, స్నేహితులు, సెలబ్రిటీల కోసం ఢిల్లీలో విరుష్క జోడీ ఇంతకుముందే ఒకసారి విందు ఇచ్చింది. ఆ విందుకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా తాజా విందులో తన సహచర క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు, ప్రముఖులు హాజరై విరుష్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

loader