ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట న్యూ ఇయర్ కు ఎక్కడికో తెలుసా

First Published 16, Dec 2017, 1:19 PM IST
virat anushka new year celebrations in south africa
Highlights
  • ఇటలీలో పెళ్లి చేసుకున్న విరాట్ ,అనుష్క
  • త్వరలో ముంబై,దిల్లీలలో రిసెప్షన్
  • అనంతరం న్యూ ఇయర్ కోసం సౌతాఫ్రికాకు.. ఎందుకంటే..

ఇటలీలో డెస్టినేషన్ వెడింగ్ చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లి దంపతులు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తమ వివాహాన్ని ధృవీకరిస్తూ ఫోటోలు పోస్టు చేశారు. ఒకరు టీమిండియా కెప్టెన్ కావడం, మరొకరు బాలీవుడ్ స్టార్ కావడంతో వీరి పెళ్లి విషయం దేశ వ్యాప్తంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఢిల్లీ, ముంబైలలో వేర్వేరుగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించి ప్రముఖులకు గ్రాండ్‌గా విందు ఇవ్వబోతున్నారు.

 

వెడ్డింగ్ రిసెప్షన్ అనంతరం విరాట్-అనుష్క సౌతాఫ్రికాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో విరాట్ క్రికెట్ టూర్ నిమిత్తం సౌతాఫ్రికా వెళుతున్నారు. పెళ్లయిన తర్వాత విరాట్ వెళుతున్న ఫస్ట్ టూర్ ఇదే. రెండు నెలల పాటు ఈ టూర్ సాగనుంది. విరాట్‌తో పాటు అనుష్క కూడా సౌతాఫ్రికా వెళ్లబోతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఇద్దరూ ఇక్కడే జరుపుకోనున్నారు

 

సౌతాఫ్రికాలో తన భర్త విరాట్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత అనుష్క తిరిగి ప్రొఫెషన్లో బిజీ కానుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె షారుక్ ఖాన్‌తో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ ధావన్ సినిమా చేయనుంది. ఫిబ్రవరిలో తన తాజా చిత్రం ‘పారి' చిత్ర ప్రమోషన్స్‌లో అనుష్క బిజీ కాబోతోంది.

loader