బాహుబలి చిత్రాన్ని మించిన మాధవన్ విక్రమ్ వేధా

vikram vedha movie crossed bahubali and stood topper in imdb 2017 top list
Highlights

  • ఐఎండీబీ డేటాబేస్ లో టాపర్ గా నిలిచిన విక్రమ్ వేదా మూవీ
  • బాహుబలి కూడా ఈ మూవీ తర్వాతే
  • టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో అర్జున్ రెడ్డి, ఘాజీ కూడా..

దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రికార్డులు సృష్టించి చరిత్ర తిరగరాసిన ‘బాహుబలి 2’ చిత్రం కంటే ముందంజలో ఓ మూవీ వుందంటే.. అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అదే జరిగింది. మాధవన్‌ నటించిన చిత్రం ఓ విషయంలో బాహుబలిని దాటేసింది. దక్షిణ చిత్ర పరిశ్రమ నుంచి ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) 2017 టాప్‌ 10 ఇండియన్‌ చిత్రాల జాబితాను విడుదల చేసింది.

 

ఈ జాబితాలో ఆర్‌.మాధవన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ మొదటిస్థానంలో ఉండగా.. ప్రభాస్‌, రానా నటించిన ‘బాహుబలి 2’ రెండో స్థానంలో ఉంది. విజయ్‌ దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ మూడు చిత్రాలు విమర్శకుల చేత కూడా ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. ఇక బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ఇర్ఫాన్‌ఖాన్‌ చిత్రం ‘హిందీ మీడియం’ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

 

రానా నటించిన మరో చిత్రం ఘాజీ కూడా ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఇక ‘కిలాడీ’ అక్షయ్‌కుమార్‌ నటించిన రెండు చిత్రాలు ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ2’ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టాప్‌ 10లోని చివరి రెండు స్థానాల్లో ఇళయదళపతి విజయ్‌ నటించి ‘మెర్సెల్‌’, మమ్ముట్టి మలయాళ చిత్రం ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ ఉన్నాయి.

 

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన చిత్రాలు టాప్‌ 10లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఈ ఏడాది షారుఖ్‌ నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’, సల్మాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

 

loader