సారాంశం

కాళిదాస్ కి కాబోయే భార్య పేరు తరణి. ఆమె తమిళనాడులో ఫేమస్ మోడల్. 2019లో తరణి మిస్ తమిళనాడు పెజెంట్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది.

కమల్ హాసన్ కొడుక్కి పెళ్లేంటి.. అసలు కమల్ హాసన్ కి కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నారా. వాస్తవానికి పెళ్లి సీనియర్ నటుడు జయరామ్ కొడుక్కి. జయరాం తనయుడు కాళిదాస్ జయరాం యువ హీరోగా రాణిస్తున్నాడు. విక్రమ్ చిత్రంలో కాళిదాస్.. కమల్ హాసన్ కొడుకుగా నటించిన సంగతి తెలిసిందే. 

అలాగే తెలుగులో పలు చిత్రాల్లో కాళిదాస్ క్యారెక్టర్ రోల్స్ చేశాడు. అయితే కాళిదాస్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 29 ఏళ్ల కాళిదాస్ చాలా కాలంగా తన ప్రియురాలితో రిలేషన్ లో ఉన్నాడు. శుక్రవారం రోజు కాళిదాస్ కి తన ప్రియురాలి తో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరిద్దరి వివాహం కూడా జరగబోతోంది. 

అను ఇమ్మాన్యుయేల్ కి రుణపడిపోతాం అంటున్న పవన్ ఫ్యాన్స్

కాళిదాస్ కి కాబోయే భార్య పేరు తరణి. ఆమె తమిళనాడులో ఫేమస్ మోడల్. 2019లో తరణి మిస్ తమిళనాడు పెజెంట్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంగా వివాహం చేసుకోబోతున్నారు. 

View post on Instagram
 

కాళిదాస్ తండ్రి జయరాం ఎంతటి ఫేమస్ నటుడో తెలిసిందే. దీనితో జయరామ్ తనయుడి నిశ్చితార్థానికి చాలా మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారిలో అపర్ణ బాలమురళి, మేఘా ఆకాష్, సుధా కొంగర లాంటి వారు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ప్రారంభించిన కాళిదాస్.. తెలుగులో భాగమతి చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అల వైకుంఠపురములో, రావణాసుర, ధమాకా, ఖుషి లాంటి చిత్రాల్లో నటించాడు. 

Also Read: ఉప్పొంగే సొగసు చూపిస్తూ ఊహించని షాకిచ్చిన ఎన్టీఆర్ బ్యూటీ