అను ఇమ్మాన్యుయేల్ కి రుణపడిపోతాం అంటున్న పవన్ ఫ్యాన్స్..జపాన్ మూవీ ఇలా కలసి వచ్చిందా..
జపాన్ చిత్రంలో కొన్ని పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండే సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని డైలాగులతో పాటు అజ్ఞాతవాసి చిత్ర పోస్టర్స్ కూడా ఈ మూవీలో చూపించారు.
Japan Movie
తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది. తొలి చిత్రమే విజయం సాధించడం, గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మాన్యుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది.
Anu Emmanuel
ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత అను.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీనితో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది.
ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. ఇటీవల అను.. అల్లు శిరీష్ కి జోడిగా 'ఉర్వశివో రాక్షసివో' అనే చిత్రంలో నటించింది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ హిట్ గా నిలిచింది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన క్రేజీ మూవీ జపాన్. కార్తీ సరసన ఈ చిత్రంలో అను హీరోయిన్ గా నటించింది.
ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొన్ని సన్నివేశాలు బావున్నప్పటికీ చిత్రం పూర్తి స్థాయిలో అలరించేలా లేదని అంటున్నారు. అయితే జపాన్ లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ కి పవన్ ఫ్యాన్స్ లో క్రేజ్ పెరిగిపోతోంది. అదేంటి అనుకుంటున్నారా.. ఆ ఐతే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. జపాన్ చిత్రంలో కొన్ని పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండే సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని డైలాగులతో పాటు అజ్ఞాతవాసి చిత్ర పోస్టర్స్ కూడా ఈ మూవీలో చూపించారు.
అజ్ఞాతవాసి లో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. జపాన్ చిత్రంలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా బి, సి సెంటర్స్ లో ఫ్యాన్స్ టాప్ లేచిపోయేలా హంగామా చేస్తున్నారు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ సంజు అనే ఫిలిం హీరోయిన్ గా మెరిసింది. ఆమె స్టార్ యాక్ట్రెస్ గా ఎదగడమే కాదు.. ఏకంగా పవన్ సినిమాలో నటించే స్థాయికి ఎదిగిన నటిగా చూపించారు.
పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఈ రేంజ్ లో ఉపయోగించడానికి కారణం అను ఇమ్మాన్యుయేల్ ఉండడం వల్లే అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు ఆమెకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కి రుణపడిపోతాం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.