Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో విక్రమ్ డ్రైవర్ కి తీసుకొని రమ్మని చెబుతాడు. ఇంతలోనే పక్కన ఒక అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనగా వాళ్ళ అమ్మ వద్దు నేను చెప్పేది విను నీ మంచి కోసమే చెప్తున్నాను అనడంతో ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాటలు వినకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని మొండి పట్టు పడుతుంది. ఇంతలోనే విక్రమ్ అక్కడికి వచ్చి ఏంటి వీడిని ప్రేమించావా అనడంతో వీటిని కాదు అతన్ని అని అంటుంది. మరి అమ్మని బొమ్మ అన్నప్పుడు లేదు ఇప్పుడు నీకు కోపం వచ్చిందా అని అంటాడు విక్రమ్. ఏంటి తమ్ముడు ఈ అమ్మాయిని ప్రేమించావా అనగా అవును ఈ అమ్మాయి కోసం ప్రాణాలైనా ఇస్తాను అనగా విక్రమ్ పక్కనే ఉన్న కత్తిని తీసుకొని వస్తాడు.
అప్పుడు అతని మెడపై కత్తి పెట్టడంతో అతడు భయంతో వణికిపోతూ ఉంటాడు. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అనగా నువ్వు అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తానంటే ఈ క్షణమే ప్రాణాలు తీసుకుంటాను ఇచ్చేయ్ బాసు అనడంతో ఇది ఉద్యోగం చేస్తే అది తిని కూర్చుందాం అనుకున్నాను కానీ దీని కోసం ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ నా దగ్గర లేదు అని అంటాడు. ఇప్పుడు అబ్బాయి మాటలకు అమ్మాయి షాక్ అవుతుంది. అప్పుడు ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇదే మాట మీ అమ్మ చెబితే అమ్మ మీద కోపడ్డావు అని విక్రమ్ ఆ అమ్మాయి పై సీరియస్ అవుతాడు. అప్పుడు స్వారీ అమ్మ అని అనడంతో ఆ అమ్మాయిని ఆమె ఇంటికి పిలుచుకొని వెళ్తుంది.
మరోవైపు దివ్య హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి నాకు ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అని తులసి ఫోన్ చేసి అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అనడంతో తులసి ఆనంద పడుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావ్ అమ్మ అనగా మీ నాన్న ఎందుకో ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు అందుకే వచ్చేసాను అని అంటుంది తులసి. ఆ తర్వాత దివ్య ఇంటికి వెళుతూ మధ్యలో స్కూల్ పిల్లలు ఆడుకుంటూ ఉండగా అది చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఒక కారు స్పీడ్ గా వస్తుండడంతో అక్కడే గుంతలో ఉన్న నీళ్లు పిల్లల మీద పడతాయి అని దివ్య వెళ్లి ఆ నీళ్లు పిల్లలపై పడకుండా అడ్డుగా నిలబడుతుంది.
అప్పుడు ఇంతలోనే అతను గారు సడన్గా బ్రేక్ వేయడంతో అప్పుడు దివ్యని అలా చూసినా విక్రమ్ ఒక్కసారిగా దివ్య వైపు అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య కారు డ్రైవర్ తో వాదిస్తూ ఉండగా విక్రమ్ దివ్యవైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య ముఖం వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు పిల్లలు సంతోషంతో దివ్యని హత్తుకోవడంతో దివ్య పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండగా అది చూసి సంతోషపడుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడు దివ్య ఆటో ఎక్కి వెళ్లిపోవడంతో విక్రమ్ ఆటో వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లి అందమైన అమ్మాయి అలా కనిపించింది ఇలా వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ పదేపదే దివ్యని తలుచుకొని సంతోష పడుతూ ఉంటాడు.
మరోవైపు తులసి ఎందుకు ఈయన నన్ను తొందరగా రమ్మని పిలిచారు అని కేఫ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నందు తులసిని వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు లాస్య నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి తులసి దివ్య మ్యారేజ్ సెట్ అయింది అనడంతో తులసి ఆశ్చర్య పోతుంది. వాళ్ళ అబ్బాయి తోనే తాంబూలాలు పుచ్చుకోవడమే అని లాస్య అనడంతో తులసి షాక్ అవుతుంది. ఏంటి దివ్య తో మాట్లాడకుండా పెళ్లిచూపులు జరగకుండా నాకు చెప్పకుండా అలా ఎలా సెటిల్ చేస్తారు అని అంటుంది తులసి. అప్పుడు శరత్ ఆవిడ ఏదో జోక్ చేస్తుంది మేడం మేము మీ అమ్మాయిని ఢిల్లీలో చూసాము మీ అమ్మాయి మా ఇంటి కోడలు అయితే బాగుంటుందని అనుకున్నాము అని అంటాడు.
అప్పుడు తులసి మొన్ననే చదువు పూర్తి చేసింది అప్పుడే పెళ్లా అని అంటుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తోంది ఉద్యోగం చేస్తే తనకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు దివ్య తల్లిగా మీ మాటను గౌరవిస్తున్నాము. మా అబ్బాయి మీ ఇంటికి పిలుచుకుని వస్తాము నచ్చితేనే చూడండి కానీ పెళ్లి చూపులకు కాదు జస్ట్ గెట్ టుగెదర్ అని అంటాడు శరత్. అప్పుడు తులసి ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. సరే అని అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. మరోవైపు విక్రం వాళ్ళ అత్తయ్య మామయ్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు విక్రం వాళ్ళ మామయ్య ఇంజక్షన్ వేయబోతుండగా ఇంతలోనే అక్కడికి విక్రమ్ వస్తాడు.
ఏంటి మామయ్య ఇది అనడంతో ఇదే మీ మామయ్య పనితీరు అల్లుడుగారు అని అంటాడు. అప్పుడు విక్రమ్ మామయ్య నువ్వు పశువుల డాక్టర్ వి పశువుల డాక్టర్ల ఉండాలి ఇలా ఎవరికి పడితే వారికి ఇంజక్షన్లు చేయకూడదు అని అంటాడు. మరొకవైపు రాజ్యలక్ష్మి మొబైల్ ఫోన్ చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి సంజయ్ వస్తాడు. ఇంతలోనే అక్కడికి విక్రమ్ వస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి పాదాలకు నమస్కరించుకొని మౌనంగా బాధతో విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఏమైంది నాన్న విక్రమ్ ఈ అమ్మతో ఎప్పుడు సంతోషంగా మాట్లాడే వాడివి అలా మౌనంగా ఉన్నావు అని అంటుంది రాజ్యలక్ష్మి. ఏమైంది నాన్న ఈ అమ్మను పరాయి దానిలా చూస్తున్నావు ఈ అమ్మ వల్ల తప్ప ఏమైనా జరిగిందా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి.
