ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసేది ఇతడేనా..?

First Published 14, May 2018, 6:37 PM IST
vikram k kumar to direct ntr
Highlights

'మహానటి' సినిమా సూపర్ సక్సెస్ తో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ కళకళలాడుతోంది

'మహానటి' సినిమా సూపర్ సక్సెస్ తో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ కళకళలాడుతోంది. ఇకపై తమ బ్యానర్ లో వరుస సినిమాలను నిర్మించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమ బ్యానర్ లో నాగార్జున-నాని మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ స్టార్ హీరో ఎన్టీఅర్ తో సినిమా ఉంటుందని ప్రకటించారు.

ప్రస్తుతానికి ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ లో సినిమా మొదలవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. అయితే ఎన్టీఆర్ ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నరనే విషయంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ పేరు వినిపిస్తోంది. ఇష్క్, మనం వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ గతేడాది 'హలో' చిత్రంతో  ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అయితే ఆయనతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ ఇప్పటికే అతడికి అడ్వాన్సులు కూడా అందించిందని చెబుతున్నారు. నిజానికి విక్రమ్.. నానితో సినిమా చేయాల్సింది కానీ అది ఆగిపోవడంతో వైజయంతీ మూవీస్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ కథ ఎన్టీఆర్ కోసమేననే వార్తలు గుప్పుమన్నాయి. మరి దీనిలో ఎంతవరకు నిజముందో దర్శకనిర్మాతలు స్పందించాల్సివుంది!

loader