తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ ను చూసి అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎంతో స్టైలీష్ గా , హుందాగా ఉండే తమ అభిమాన హీరో ఇలా అయిపోయాడేంటి.. అని బాధపడుతున్నారు.
కెప్టెన్ విజయ్ కాంత్.. తమిళతెరను ఊపు ఊపేసిన హీరో.. విప్లవ నాయకుడిగా పేరు సంపాదించిన నేత, కెప్టెన్ బిరుదును పొంది.. లక్షలాది హృదయాలను గెలిచిన హీరో. రీల్ హీరోగానే కాదు..రియల్ హీరోగా ఆయనకు పేరుంది. అటువంటి గొప్ప వ్యక్తి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్నో సార్లు ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి.. కోలుకుని డిశ్చార్జ్ అవుతూ వస్తున్నారు. అంతే కాదు కొన్నిసార్లు ప్రాణాలతో పోరాటం చేసి.. చావును కూడా జయించి.. నిజమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా మరోసారి హాస్పిటలైజ్ అయ్యారు విజయ్ కాంత్.
ఈమధ్య జలుబు జ్వరంతో హాస్పిటల్ కు వెళ్ళిన విజయ్ కాంత్.. సాయంత్రానికి డిశ్చార్జ్ అవుతారు అనుకుంటే.. దాదాపు 20 రోజులు హాస్పిటల్ లో ఉన్నారు. చాలా సీరియస్ అవ్వడంతో వెంటిలేటర్ పై విజయ్ కాంత్ కు ట్రీట్మెంట్ అందించారు. ఇక ఆయన మరణించారంటూ కొన్నిపుకార్లు కూడా లేచాయి. కాని విజయ్ కాంత్ భార్య ఓ వీడియో సందేశంతో.. రూమర్స్ కు చెక్ పెట్టడంతో పాటు.. విజయ్ కాంత్ ఫోటోను కూడా రిలీజ్ చేయడంతో..ఫేక్ న్యూస్ లకు బ్రేక్ పడింది.
Shreyas Talpade: గుండెపోటుకు గురైన బాలీవుడ్ నటుడు.. ఇప్పుడెలా ఉంది..?
ఇక ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరారు. కాని విజయ్ కాంత్ ను చూడాలని.. ఆయన పరిస్థితి ఎలా ఉందా అని అభిమానులు ఎదరు చూస్తుండగా.. తాజాగా అభిమానులకు కనిపించారు కెప్టెన్. కాని విజయ్ ను అలా చూసిన ఫ్యాన్స్ గుండెలు పగిలిపోయాయి. చిక్కిపోయిన శరీరంతో.. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు విజయ్ కాంత్. కనీసం చెయి కూడా పైకి లేపలేని పరిస్థితుల్లో ఆయన్ను చూసిన అభిమానులు బోరున విలపించారు. పక్కన సాయంగా ఉన్న వ్యాక్తి విజయ్ కాంత్ చేతిని పైకి లేపడంతో.. ఆయన విజయ సంకేతం చూపించారు. అంతే కాదు చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయిన విజయ్.. ప్రస్తుతం వీల్ చైర్ పై కూడా కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఓ మనిషి పక్కన ఉండి ఎప్పుడూ పట్టుకోవలసిన పరిస్థితి. అంతే కాదు ఎదురుగా ఉన్న మనుషులను కూడా ఆయన గుర్తు పట్టే పరిస్థితుల్లో లేరు. విజయ్ ను ఇలా చూసిన ఫ్యాన్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాజాగా డీఎండీకే పార్టీ జనరల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్కిశల్యమై కనిపించిన విజయకాంత్‌ను చూసి అందరూ షాకయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విజయకాంత్‌య అనారోగ్యం.. మరియు ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో.. డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీగా.. ఆయన భార్య ప్రేమలత విజయకాంత్‌ను నియమించారు. తాజాగా జరిగిన పార్టీ జనరల్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సమావేశానికి విజయ్ కాంత్ ను వీల్ చైర్ లో తీసుకువచ్చారు. ఆయన నిలబడే స్థితిలో లేరు. కుర్చీకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
