ఈమధ్య హార్ట్ ఎటాక్ లు ఎక్కువై పోయాయి. వయస్సుతో సబంధం లేకుండా గుండెనొప్పి మరణాలు పెరిగిపోయాయి. సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా లేదు.. చిన్నవయస్సులోనే గుండె పోటుకు గురవుతున్నారు . తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో చేరాడు.
ఈమధ్య హార్ట్ ఎటాక్ లు ఎక్కువై పోయాయి. వయస్సుతో సబంధం లేకుండా గుండెనొప్పి మరణాలు పెరిగిపోయాయి. సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా లేదు.. చిన్నవయస్సులోనే గుండె పోటుకు గురవుతున్నారు . తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో చేరాడు.
ప్రముఖ బాలీవుడు నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. ముంబయిలోని తన స్వగృహంలో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు కుటుంబ సభ్యులు. తాజాగా ఓ హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం శ్రేయాస్... ఇంటికి వెళ్ళారు. కొద్దిసేపటికి ఈ పరిణామం జరగడంతో కంగారు పడ్డ ఫ్యామిలీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రేయాస్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రేయాస్ తల్పాడే 47 ఏళ్ల వయస్సులో గుండె పోటుకు గురయ్యారు. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన శ్రేయాస్.. కాసేపటికి చాతిలో అసౌకర్యంగా ఉంది అని చెప్పడం.. కొద్దిసేపటికే ఆ అసౌకర్యం కాస్త భరించలేని నొప్పిగా మారి.. ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అంధేరి వెస్ట్ లోని బెల్లేవ్ ఆసుపత్రికి శ్రేయాస్ ను తరలించడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సకాలంలో ఆయన్ను హాస్పిటల్ కు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది అంటున్నారు.
Vijayakanth: విజయ్ కాంత్ ఇలా అయిపోయారేంటి..? బోరున విలపిస్తున్న అభిమానులు
ఇక ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువైపోయాయి. ఎక్కువగా యువకులే ఈ మరణాలకు గురవుతున్నారు. జిమ్ చేస్తూ ఎక్కువ మంది కుర్రాళ్ళు హార్ట్ ఎటాక్ లతో కుప్పకూలిపోవడం జరుగుతోంది. కరోనా తరువాత ఈమరణాల సంఖ్య పెరిగిపోయింది. ఇక బాలీవుడ్ నటుడు శ్రేయాస్ చాలా అదృష్టవంతుడు అనుకోవాలి. ఎందుకుంటే ఆయనకు సకాలంలో వైద్యం అందటంతో ఆయన ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు శ్రేయాస్ తల్పాడే. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి.
Deepika padukone: కాలినడకన తిరుమలకు దీపికా పదుకొనే...నేడు దర్శనం..
ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ వెల్కమ్ టు జంగిల్ షూటింగ్ పాల్గొంటున్నారు శ్రేయాస్. ఆయన మరాఠీ సీరియల్స్, స్టేజ్ షోల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఇక్బాల్ సినిమాలోని తన పాత్రతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దోర్, అప్నా సప్నా మనీ మనీ, ఓం శాంతి ఓం, వెల్కం టు సజ్జన్ పూర్, గోల్ మాల్ రిటర్న్ వంటి 40 కి పైగా హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు.
