సావిత్రి కూతురికి సీఎం బావ!

vijaya chamundeswari speech at mahanati team meet in amaravathi
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 'మహానటి' సినిమా సక్సెస్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో ప్రత్యేకంగా యూనిట్ ను సన్మానించారు. అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి మాట్లాడుతూ..

''చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని పిలవాలా లేక బావ గారు అని అనాలా అనే విషయం నాకు తెలియడం లేదు. ఎందుకంటే వారి కుటుంబంతో మాకు అంత అనుబంధం ఉంది. నారా భువనేశ్వరిని నేను అక్కా అని పిలిచేదాన్ని. ఈరోజు ఆయన అమ్మ చరిత్రతో తీసిన సినిమాను ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉంది. అమ్మ పుట్టిన ఊరిలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇక అమ్మ పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. నాకు అమ్మని చూడాలనిపించిన ప్రతిసారి తననే చూస్తానని కీర్తికి చెప్పాను'' అంటూ వెల్లడించారు.   

loader