సావిత్రి కూతురు.. డబ్బు కోసం కన్నతల్లినే ఇబ్బంది పెట్టిందా?

Vijaya Chamundeswari Reality Revealed
Highlights

'మహానటి' సినిమా విడుదలైన తరువాత సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అదే రేంజ్ లో సినిమా

'మహానటి' సినిమా విడుదలైన తరువాత సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అదే రేంజ్ లో సినిమాపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సినిమాలో జెమినీ గణేశన్ ను తప్పుగా చూపించారంటూ అతడి మొదటి భార్య కూతురు కమలా సెల్వరాజ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సావిత్రి పెదనాన్న కె.వి.చౌదరి తమ్ముడు మనవరాలిని అంటూ ఓ మహిళ ఈ సినిమాపై పలు అభ్యంతరాలను తెలిపింది. 
''బయోపిక్ అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. కానీ మహానటిలో నిజాలు దాచేశారు. సావిత్రి కూతురు విజయ ఛాముండేశ్వరి మీడియా ముందుకు వచ్చి తల్లిని తలుచుకుంటూ బాధ పడుతుంది. ఎమోషనల్ అవుతుంది. ఆ మాత్రం ఎమోషన్ ఉండాలి కానీ కన్నతల్లిని ఆస్తుల కోసం ఇబ్బంది పెట్టి ఇప్పుడు మాత్రం ఆమెపై ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించడం నేను సహించలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు మాట్లాడాలనుకున్నాను. పెళ్లైన తరువాత సావిత్రి గారి కూతురు విజయ్ ఆస్తుల కోసం తన అత్తవారి ఇంటి సంభ్యులతో కలిసి తల్లిపై కేసు పెట్టింది. సావిత్రి గారు అన్నా నగర్ లో అద్దె ఇంట్లో ఉంటే.. విజయ్ మాత్రం తన తల్లి సొంతింట్లో ఉండేది. సావిత్రి గారు చనిపోయిన తరువాత 
సతీష్ ను విజయ్ ఎందుకు తీసుకువెళ్లలేదు. జెమినీ గారు సతీష్ ను పెంచారు. ఇంతా చేసిన విజయ్ ఇప్పుడు మాత్రం మీడియా ముందుకొచ్చి ఏడవడం అంతా ఏమీ బాలేదు. నిజాలు తెలిసిన వారికి ఇదంతా చూస్తూ ఉండడం కష్టంగా ఉంటోంది'' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

loader