కీర్తి సురేష్ కు గోల్డ్ బ్రేస్ లెట్ గిఫ్ట్ గా ఇచ్చిన విజయ్ స్వయంగా కీర్తి చేతికి తానే అలంకరించిన తమిళ హీరో ఇటీవల రిలీజైన సంక్రాంతి మూవీ బైరవ సక్సెస్ పై టీమ్ కు బహుమతులు

ఇళయ తళపతి విజయ్ హీరోయిన్ కీర్తి సురేష్ కు బంగారు బ్రేస్ లెట్ తొడిగాడు. అదేదో కర్చీఫ్ వ్యవహారం అనుకోకండి. మరేంలేదు.. ఇటీవల సంక్రాంతి కానుకగా విజయ్ నటించిన భైరవ రిలీజై సంచలన హిట్ గా నమోదైంది. ఈ హిట్ మూవీపై సంబరాలు జరుపుకుంటోంది టీమ్. తన చిత్ర టీమ్ కు సక్సెసైనప్పుడల్లా గిఫ్ట్స్ అందించే విజయ్... ఈ సారి భైరవ సినిమా సక్సెస్ తో అందరికీ బహుమతులు పంచాడు.

పనిలో పనిగా హీరోయిన్ కీర్తి సురేష్ కు తనే స్వయంగా మణికట్టుకు అలంకరించి ఆమెను మెస్మరైజ్ చేశాడు. కీర్తి సురేష్, ఇటు తెలుగులోనేకాక అటు కోలీవుడ్ లోనూ యమా క్రేజ్ సంపాదించేస్తోంది. ప్రస్థుతం కీర్తి నటించిన నాని మూవీ నేను లోకల్ సూపర్ హిట్ టాక్ సంపాదించింది.

Scroll to load tweet…