సారాంశం
వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన ఓ సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది. ఈవెంట్ ఆర్గనైజర్లు చేసిన తప్పుకి నానిపై నిందలు పడే ప్రమాదం పొంచి ఉంది.
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. నాని నుంచి రాబోతున్న మరో ఎమోషనల్ డ్రామా ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 7 హాయ్ నాన్న చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది.
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రోజు వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన ఓ సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది. ఈవెంట్ ఆర్గనైజర్లు చేసిన తప్పుకి నానిపై నిందలు పడే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల ప్రమోషన్స్ పద్ధతులు మారుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ని కూడా ప్రచారానికి వాడేస్తున్నారు.
హాయ్ నాన్న ఈవెంట్ లో యాంకర్ సుమ స్క్రీన్ పై కొన్ని ఫోటోలు చూపిస్తూ వాటిపై స్పందించాల్సిందిగా మృణాల్ ఠాకూర్ ని కోరింది. నాని, నజ్రియా, దుల్కర్ సల్మాన్ ఫోటోలు చూపించారు. తనకి తోచిన విధంగా మృణాల్ కామెంట్ చేసింది. కానీ ఒక్కసారిగా స్క్రీన్ పై రష్మిక, విజయ్ దేవరకొండ పర్సనల్ ప్రైవేట్ పిక్స్ ప్రత్యక్షం అయ్యాయి.
వాళ్లిద్దరూ బాలిలో వెకేషన్ లో గడిపిన దృశ్యాలని కలిపి ఉన్న ఫోటో స్క్రీన్ పై ఉంచారు. దీనితో అంతా ఒక్కసారిగా షాక్. యాంకర్ సుమ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక తడబడింది. మృణాల్ ఠాకూర్ కూడా ఏంటిది అంటూ ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడింది.
దీనితో యాంకర్ సుమ వెంటనే సిచ్యుయేషన్ ని కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆమె కవరింగ్ ఇంకా దారుణంగా ఉంది. పక్కనే ఉన్న కెమెరా మెన్ ని మందలిస్తున్నట్లు సుమ హంగామా చేసింది. రేయ్ నువ్వేనా రా ఆరోజు బాలికి వెళ్ళింది. నాకు అప్పుడే డౌట్.. ఇలాంటి పిక్చర్స్ తీయొచ్చా అసలు అంటూ హంగామా చేసింది. అసలు ప్రైవసీ ఉండదా.. ఏది పడితే అది పెడతారు అని కామెంట్స్ చేసింది.
అంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి ఆ ఫోటోపై మరోసారి మృణాల్ ని కామెంట్ అడిగింది. దీనితో మృణాల్ తప్పదు అన్నట్లునా వెకేషన్ మోడ్ అని చెప్పింది. మరోసారి మృణాల్ కామెంట్ చేస్తూ రెండు ఫొటోల్లో ఆకాశం ఒకేలా ఉందని చెప్పింది. మైక్ ని ఆడియన్స్ వైపు పెట్టి వాళ్ళు కామెంట్ చేసేలా సుమ ఎంకరేజ్ చేసింది.
Also Read: పాన్ ఇండియా హిట్ కొట్టి అంత గర్వం ఎందుకో..
ఈ సంఘటనపై నానిపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన సినిమా ప్రచారం కోసం ఇతర హీరోయిన్ల ప్రైవసీకి భంగం కలిగించేలా వారి ఫోటోలు వాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ దృశ్యాలని వైరల్ చేస్తూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే నాని అంభిమానులు మాత్రం ఇది ఈవెంట్ ఆర్గనైజర్ల తప్పు.. నాని అసలు ఈ విషయం గురించి ముందే తెలిసి ఉండదు అని అంటున్నారు.