MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాన్ ఇండియా హిట్ కొట్టి అంత గర్వం ఎందుకో.. నోరు జారిన కాంతార హీరో, రిషబ్ శెట్టిపై ఫస్ట్ టైం ట్రోలింగ్

పాన్ ఇండియా హిట్ కొట్టి అంత గర్వం ఎందుకో.. నోరు జారిన కాంతార హీరో, రిషబ్ శెట్టిపై ఫస్ట్ టైం ట్రోలింగ్

కన్నడపై ప్రాంతీయ అభిమానం చాటుకునే క్రమంలో రిషబ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి. ఒక్క హిట్ వచ్చింది కదా అని నేను ఇతర ఇండస్ట్రీల వైపు చూసే రకం కాదు అంటూ రిషబ్ కామెంట్స్ చేశాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 29 2023, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో యుగంలో సెలెబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటకూడా హైలైట్ అవుతోంది. కొన్ని సార్లు నెగిటివ్ గా వెళ్లొచ్చు.. మరికొన్ని సార్లు పాజిటివ్ గా ఉండొచ్చు. సెలెబ్రిటీలు చిన్న పొరపాటు చేసినా నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం కన్నడ హీరో కాంతార చిత్రంతో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి హాట్ టాపిక్ గా మారాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చిత్రం కన్నడలో మాత్రమే కాలేదు అన్ని భాషల్లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ వ్యాప్తంగా అవార్డులు కూడా దక్కుతున్నాయి. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 

37

కన్నడపై ప్రాంతీయ అభిమానం చాటుకునే క్రమంలో రిషబ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి. ఒక్క హిట్ వచ్చింది కదా అని నేను ఇతర ఇండస్ట్రీల వైపు చూసే రకం కాదు అంటూ రిషబ్ కామెంట్స్ చేశాడు. రిషబ్ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడ నుంచి ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న ప్రశాంత్ నీల్, రష్మిక లాంటి వారిపై సెటైర్ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

47

కాంతార చిత్రాన్ని ముందుగా ఆదరించింది నా కన్నడ ప్రేక్షకులే అని రిషబ్ శెట్టి వ్యాఖ్యానించాడు. ఇతర భాషల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి కానీ నేను వెళ్లను అని రిషబ్ తేల్చేశాడు. అయితే రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలని లోతుగా చర్చిస్తున్న నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

57

రిషబ్ శెట్టి కన్నడపై ప్రాంతీయ అభిమానం చాటుకోవడం మంచిదే. కానీ ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడి ఉండకపోతే బావుండేది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల వల్ల భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు. కళకి రాష్ట్రాల హద్దులు లేవు. 

Also Read: జబర్దస్త్ ఖుష్బూ లిప్ కిస్ అప్పట్లోనే సంచలనం..ఆ హీరోలతో రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మి, డింపుల్ క్రేజీ లిప్ లాక్స్

67

సౌత్ హీరోల చిత్రాలని నార్త్ ఆడియన్స్ ఆదరిస్తున్నారు. బాలీవుడ్ హీరోలు ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నారు. అంతెందుకు కంతార చిత్రం కన్నడలో మాత్రమే హిట్ అయి ఉంటే అసలు రిషబ్ శెట్టి ఎవరో దేశానికి తెలిసేది కాదు. కాంతార మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అంటే అన్ని భాషల ఆడియన్స్ ఆదరించడం వల్లే అనే విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు. 

77
rishab Shetty

rishab Shetty

దర్శకులు కానీ, నటులు కానీ తమ నైపుణ్యాన్ని ఇతర భాషల్లో కూడా చాటుకోవడంలో.. వేరే భాషల్లో చిత్రాలు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. పాన్ ఇండియా గుర్తింపు దక్కింది కాబట్టి ఇలా గర్వంతో వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు రిషబ్ శెట్టిని ట్రోల్ చేస్తున్నారు. అంత ప్రాంతీయ అభిమానం చూపిస్తున్నప్పుడు తన చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేయడం ఎందుకు అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రిషబ్ శెట్టి తొలిసారి ట్రోలింగ్ కి చిక్కాడు. ఇదిలా ఉండగా రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: టాలీవుడ్ డైరెక్టర్స్ కి వరంగల్ పిల్ల కనపడదా..

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Recommended image2
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image3
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved