'అర్జున్ రెడ్డి' సినిమాలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడు కేటగిరీలో ఫిలిం ఫేర్ అవార్డు ను సొంతం చేసుకున్నారు. ఈ రేసులో చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వీరందరూ ఉన్నా.. అందరిని దాటుకొని అవార్డు సొంతం చేసుకున్నారు.

తొలిసారి ఫిలిం ఫేర్ అవార్డు అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ ఆ అవార్డు ను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కోసం ఉపయోగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఎంతోమంది సహాయం కోరితే కేటీఆర్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సహాయం చేస్తుండడం చూస్తున్నాను.. నా తొలి అవార్డువేలంలో అమ్ముదిపోతే ఆ డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.

దీనిపై స్పందించిన కేటీఆర్.. 'సీఎం రిలీఫ్ ఫండ్ కు సహాయం చేయాలనుకున్న నీ ఆలోచనను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదాం' అంటూ ట్వీట్ చేశారు. తొలి ఫిలిం ఫేర్ అవార్డు ను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వేలం విజయ్ దేవరకొండ వేలం వేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.