ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలయింది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలయింది. దీనితో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

Sukumar, Allu Arjun హిట్ కాంబోలో తెరకెక్కిన పుష్ప భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్, అల్లు అర్జున్ నటన, మేకోవర్ ఈ చిత్రంలో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్ శుక్రవారం రోజు స్వయంగా తన ఫ్యామిలీతో కలసి వెళ్లి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో అభిమానుల మధ్య పుష్ప చిత్రాన్ని వీక్షించారు. అల్లు అర్జున్ ఎప్పుడూ స్టైల్ గా కనిపిస్తారు. అందులో సందేహం లేదు. 

కానీ థియేటర్ కి వచ్చినప్పుడు బన్నీ ధరించిన టీషర్ట్ అందరినీ ఆకర్షించింది. ఆ టీషర్ట్ పై రౌడీ అల్లు అర్జున్ అని ఉంది. ఈ టీషర్ట్ గురించి అసలు విషయాన్ని బన్నీ సోషల్ మీడియా వేదికగా బయట పెట్టాడు. తాను ధరించిన టీషర్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గిఫ్ట్ గా పంపినట్లు పేర్కొన్నాడు. అందుకు గాను విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు తెలిపాడు. 

'బన్నీ అన్నా నేను ప్రామిస్ చేసినట్లుగా నీకు కాటన్ టీషర్ట్ పంపిస్తానున్నాను' అని విజయ్ దేవరకొండ చీటిలో తన సందేశాన్ని రాశాడు. విజయ్ దేవరకొండ గిఫ్ట్ గురించి అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పేర్కొన్నాడు. 

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య మంచి రిలేషన్ ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' చిత్రంలో నటించి ఘనవిజయం అందుకున్నాడు. ఇదిలా ఉండగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ అదరగొట్టినప్పటికీ సుకుమార్ మార్క్ కొంచెం మిస్ అయినట్లు ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం పుష్ప ది రైజ్ కాగా రెండవ భాగం పుష్ప ది రూల్. 

రష్మిక మందన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో మెరిశారు. సమంత తన కెరీర్ లో తొలిసారి ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించింది. 

Also Read: Pushpa row: ఏపీలో పుష్ప థియేటర్స్ మీద ఫాన్స్ ఎటాక్,లాఠీ ఛార్జి