Asianet News TeluguAsianet News Telugu

Pushpa row: ఏపీలో పుష్ప థియేటర్స్ మీద ఫాన్స్ ఎటాక్,లాఠీ ఛార్జి

 మాస్‌లుక్‌లో బన్నీ అదరగొట్టేశాడు. చిత్తూరు యాసలో ఆయన పలికే డైలాగ్స్‌ అదుర్స్‌. యాక్షన్ సన్నివేశాలలోనూ బన్నీ విశ్వరూపం చూపించాడు. ప్రతి సన్నీవేశంలోనూ ‘తగ్గేదేలే’అన్నట్లు అల్లు అర్జున్‌ నటన ఉంది.

Allu Arjun Fans Attack Pushpa Theaters In AP
Author
Hyderabad, First Published Dec 18, 2021, 7:16 AM IST

సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో 12 ఏళ్ల తర్వాత కలిసి చేసిన సినిమానే ‘పుష్ప’.రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప - ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.‘అల వైకుంఠపురములో’లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత బన్నీ... ‘రంగస్థలం’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత సుకుమార్‌ నుంచి వస్తున్న ‘పుష్ప’పై భారీ ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ‘తగ్గేదే లే’అంటూ జానాల్లోకి దూసుకొచ్చిన ‘పుష్ప’మూవీ డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్స్ మీద కొన్ని చోట్ల బన్ని ఫ్యాన్స్ ఎటాక్ చేశారని సమాచారం.

వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల పుష్ప బెనిఫిట్ షోను ప్రదర్శించనందుకు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వటం జరిగింది. హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తూ కొన్ని థియేటర్లు బెనిఫిట్ షోల టిక్కెట్లను అమ్మారు. అయితే తీర్పు  రాకపోవడంతో థియేటర్లు బెనిఫిట్ షోలు రద్దు చేసారు. డబ్బు వాపస్ ఇస్తామని చెప్పినా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఆపలేకపోయారు.  అలాగే ఆదోనిలో  ఓ థియేటర్‌పై అభిమానులు రాళ్లు రువ్వారు. హిందూపురంలో కూడా ఇలాంటి సీన్సే కనిపించాయి. 

'పుష్ప' సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం  ఒక్కొక్కరి నుంచి రూ. 500 డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని ఆరోపించారు. శుక్రవారం ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానుల మండిపడ్డారు.  అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది.

అలాగే  తిరుపతిలో ఎస్వీ థియేటర్ యాజమాన్యంపై అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ థియేటర్‌పై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయాల్సి చేసారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం సహకరించక పోవడంతో ఈ విషయంలో తాము నిస్సహాయంగా ఉన్నామని థియేటర్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios