మణిరత్నం సినిమా నుండి తప్పుకున్నాడు!

First Published 10, Dec 2017, 9:42 AM IST
Vijay Devarakonda maniratnam combination unlikely to take off
Highlights

మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పని చేయడానికి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపేవారు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆయన అవకాశం ఇస్తారేమో అని ఎదురుచూసిన హీరోల లిస్ట్ కాస్త పెద్దదే. కానీ గత కొంత కాలంగా ఆయన తన ఫామ్ ను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. 'ఓకే బంగారం' సినిమాతో పర్వాలేదనిపించినా.. ఆ తరువాత వచ్చిన 'చెలియా' మాత్రం రిలీజ్ అయినట్లే అయ్యి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హీరోలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత కొద్దిరోజులుగా ఆయన ఒక హీరోతో ప్రాజెక్ట్ అనుకోవడం అది మధ్యలోనే ఆగిపోవడం ఇదే జరుగుతోంది. మొదట బాలీవుడ్ లో సినిమా అన్నారు కానీ దాని డీటైల్స్ బయటకి రాలేదు. మొన్నామధ్య రామ్ చరణ్ తో సినిమా అన్నారు కానీ అది ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. ఇక 'అర్జున్ రెడ్డి' ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయాలని అనుకున్నారు మణిరత్నం. 

విజయ్ కూడా మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. స్టోరీ నేరేట్ చేయడం, డేట్లు ఫిక్స్ చేసుకోవడం మొత్తం పూర్తయ్యాయి. కానీ ఆఖరి నిమిషంలో విజయ్ హ్యాండ్ ఇచ్చేశాడు. దీంతో విజయ్ కు బదులుగా మరో హీరోను తీసుకోవాలని చూస్తున్నాడు ఈ వెర్సటైల్ డైరెక్టర్. మణిరత్నం అడిగినన్ని కాల్షీట్స్ కేటాయించలేకే తప్పుకున్నట్లు విజయ్ తన సన్నిహితులతో చెబుతున్నాడు. ప్రస్తుతం మణిరత్నం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్ట్ మరో హీరోతో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. 

loader