ఒకటి రెండు సినిమాలు హిట్టు కొట్టాడో లేదో విజయ్ దేవరకొండ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ నే టార్గెట్ చేసుకున్నాడు. ఎవడే సుబ్రమణ్యం లో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన అర్జున్ రెడ్డి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

 

 

ఇక ప్రస్తుతం విజయ్ పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో భామ రష్మిక అందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత తమిళ ఎంట్రీకి సిద్ధమైన విజయ్ అక్కడ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథతో వస్తున్నాడట. ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ భరత్ అనే నేను పొలిటికల్ సినిమాగా వస్తుంది.

 


మరి విజయ్ మహేష్ కు పోటీగా తాను కూడా పొలిటికల్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో జ్ఞానవెల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక భరత్ అనే నేను సినిమా విషయానికొస్తే అందులో మహేష్ సిఎంగా కనిపిస్తున్నాడు. సొసైటీకి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీస్తున్న కొరటాల శివ రాజకీయాలు, ముఖ్యమంత్రులు ఎలా ఉండాలో చూపిస్తాడట.

 

 

మరి మహేష్ చేస్తున్న పొలిటికల్ మూవీ భరత్ అనే నేను ఏప్రిల్ 20న వస్తుంది. దానికి పోటీగా విజయ్ చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మహేష్ ను టార్గెట్ చేసుకున్నా లేకున్నా విజయ్ సినిమా మాత్రం క్రేజ్ సంపాదించింది. ఆనంద్ శంకర్ ఇదవరకు ప్రాజెక్టుల వల్ల ఈ కాంబో సినిమాపై అంచనాలు పెంచాయి.