Asianet News TeluguAsianet News Telugu

ట్రోలింగ్ ని కూడా ప్రమోషన్స్ గా మార్చేశాడు!

తనకంటే బాగా పాడారని యూనిట్ కు అనిపిస్తే.. ఆ వాయిస్ తోనే మళ్లీ పాట పాడించి సినిమాలో పెడతామని ఛాలెంజ్ కూడా చేశాడు. ట్రోలింగ్స్ ను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరాడు ఈ యంగ్ హీరో

vijay devarakonda challenge to audience

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మిగిలిన హీరోలకు భిన్నంగా సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఫాలో అయ్యే పాయింట్స్ మరెవరికీ తట్టను కూడా తట్టవేమో.. నెగెటివ్ అంశాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం అతడికే చెల్లింది. అసలు విషయంలోకి వస్తే.. గీతగోవిందం సినిమాలో విజయ్ పాడిన 'వాట్ ది ఎఫ్' అనే పాటను సోషల్ మీడియాలో  విపరీతంగా ట్రోల్ చేశారు. మహిళలను తక్కువ చేస్తూ కించపరిచే విధంగా ఉన్న ఈ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ పాటలో లిరిక్స్ మార్చి మళ్లీ విజయ్ దేవరకొండతో కొత్తగా పాడించారు.

అయితే తన పాటను కామెంట్ చేస్తూ, విజయ్ వాయిస్ పై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ క్లిప్పింగ్స్ ను పెట్టారు. అయితే ఆ ఫన్నీ క్లిప్పింగ్స్ లో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసి మరీ తన ఆడియో ఫంక్షన్ లో ప్రసారం చేశాడు విజయ్. తన మీద కామెడీ చేసిన వీడియో క్లిప్పింగ్స్ ను తనే అది కూడా ఆడియో ఫంక్షన్స్ లో ప్లే చేయడం కొందరికి షాక్ ఇచ్చింది. అయితే విజయ్ తీసుకున్న ఈ స్టెప్ ను కొందరు మెచ్చుకుంటున్నారు.

ఈసారి తన గొంతు నచ్చకపోతే ప్రేక్షకులనే పాడి ఆ పాటను పంపించాలని అన్నాడు విజయ్ దేవరకొండ. తనకంటే బాగా పాడారని యూనిట్ కు అనిపిస్తే.. ఆ వాయిస్ తోనే మళ్లీ పాట పాడించి సినిమాలో పెడతామని ఛాలెంజ్ కూడా చేశాడు. ట్రోలింగ్స్ ను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరాడు ఈ యంగ్ హీరో. ఇక ఆడియో ఫంక్షన్ కు లుంగీలో వచ్చి తన రౌడీ బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios