టైటిల్ కోసం హీరోకి బెదిరింపులు!

vijay antony about kaali movie title
Highlights

తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు

తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. 'బిచ్చగాడు' చిత్రంతో తెలుగునాట గుర్తింపు పొందాడు. లేటెస్ట్ గా అతడు నటించిన 'కాళి' అనే సినిమాను 'కాశి' అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే ఏడు నిమిషాల చిత్రాన్ని విడుదల చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆ ఏడు నిమిషాల సినిమాను ఎందుకు విడుదల చేయాల్సివచ్చిందనే విషయాన్ని వెల్లడించాడు ఈ తమిళ హీరో.

కాళి అనే పేరు విని తప్పుగా అనుకున్న కొందరు టైటిల్ మార్చమని ఫోన్లు చేసి బెదిరించారట. ఎవరేం చేసినా.. టైటిల్ మాత్రం మార్చకూడదని నిర్ణయించుకున్న విజయ్ ఆంటోనీ అదే పేరుతో సినిమాను విడుదల చేశారు. అలానే ప్రేక్షకులు థియేటర్ కు రావడం ఆలస్యమయితే మొదటి పది నిమిషాల సినిమాను మిస్ అవుతారు. కాశి సినిమాలో మొదటి పది నిమిషాలే ముఖ్యమని అది మిస్ అయితే మిగిలిన సినిమా అర్ధం కాదని అందుకే ఏడు నిమిషాల సినిమా ముందే రిలీజ్ చేసినట్లు విజయ్ అంటోనీ స్పష్టం చేశారు.ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆశించిన స్పందన రావడం లేదు. కథలో ఉపకథలు ఎక్కువవ్వడం వలన అసలు పాయింట్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు. 
 

loader